ఆరోజు ఎన్టీఆర్ - చరణ్ ల సినిమా టైటిల్ ప్రకటించబోతున్నా రాజమౌళి..?
ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. ఇటువంటి క్రమంలో స్వాతంత్ర పోరాటానికి దగ్గరగా ఉండే కల్పిత కథగా తీర్చిన రాజమౌళి..అప్పట్లో మీడియా సమావేశం పెట్టి ఈ సినిమాలో చెర్రీ ఎన్టీఆర్ క్యారెక్టర్ల గురించి వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ ను స్వాతంత్య్ర దినోత్సవం ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు టైటిల్ రివీల్ పై కూడా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఫస్ట్ లుక్ తోపాటు టైటిల్ ను కూడా అదే రోజు రివీల్ చేయనున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ లో నటిస్తున్నాడు. 2020 జులై మాసంలో ఈ సినిమా రిలీజ్ కానుంది.