అప్పుడు కమల్ హాసన్.. ఇప్పుడు అమలా పాల్..
కమల్ హాసన్ విలక్షణ నటుడు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎలాంటి పాత్రనైనా అవలోకగా పరాయక ప్రవేశం చేసిన నటిస్తాడు. నటనలో ఎలాంటి వైవిధ్యం కోరుకుంటే అలా చేస్తాడు అనడంలో సందేహం అవసరం లేదు. దశావతారం సినిమాలో కమల్ నటన ఎలా ఉన్నదో తెలిసిందే. ప్రస్తుతం కమల్ భారతీయుడు 2 సినిమా చేస్తున్నాడు. మరోవైపు రాజకీయాల్లో బిజీ అయ్యాడు ఈ హీరో.
ఇదిలా ఉంటె, కమల్ హేరామ్ సినిమా గుర్తుంది కదా. అందులో కమల్ హాసన్ ఓ సీన్ లో న్యూడ్ గా కనిపిస్తాడు. ఆ సీన్ చేయడానికి కమల్ ఏ మాత్రం భయపడలేదు. అప్పట్లో కమల్ చేసిన ఈ సీన్ గురించి అందరు చర్చించుకున్నారు. హాలీవుడ్ సినిమాలు ఏ మాత్రం తీసిపోకుండా కమల్ యాక్ట్ చేస్తున్నారని కథనాలు వచ్చాయి.
ఇదే స్థాయిలో ఇప్పుడు అమలా పాల్ కూడా నటిస్తోంది. రీసెంట్ గా అమలా పాల్ ఆడై సినిమా చేసింది. తమిళంలో చేసిన ఈ సినిమా టీజర్ ను నిన్న బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దర్శకుడు కరణ్ జోహార్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఓ సంచలనంగా మారింది. సౌత్ కాదు అసలు ఇండియన్ సినిమాల్లో ఓ హీరోయిన్ ఇలా ఇప్పటి వరకు నటించలేదు.
పాత్ర డిమాండ్ మేరకు అమలాపాల్ న్యూడ్ గా నటించింది. అమలా పాల్ తీసుకున్న డేరింగ్ స్టెప్ ను అందరు మెచ్చుకుంటున్నారు. సమంత సైతం అమలా పాల్ టీజర్ ను మెచ్చుకుంటూ ట్వీట్ చేసింది. ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఇలాంటి పాత్ర చేయాలి అంటే భయపడతారు. ససేమిరా ఒప్పుకోరు. కానీ అమలా పాల్ మాత్రం అవేమి ఆలోచించకుండా పాత్రకోసం అలా నటించడం నిజంగా డేర్ స్టెప్ అనే చెప్పాలి.