గురువారం మరణించాలని ముందుగానే కోరుకున్న విజయనిర్మల !

Seetha Sailaja
నటిగా దర్శకురాలిగా విజయనిర్మల సాధించిన అద్భుతాల వెనుక ఆమెకు విపరీతమైన పట్టుదల కూడ ఉంది. ఏవిషయం అయినా ఆమె చేయాలని పట్టుదల పడితే ఎన్ని అవాంతరాలు ఎదుర్కుని అయినా తాను అనుకున్న విషయం పూర్తి చేసేదాక ఆమె వదిలి పెట్టదు అని ఆమె సన్నిహితులు అంటూ ఉంటారు. 

సాధారణంగా ఒక వ్యక్తి తాను కోరుకున్న రోజున మరణించడం అంత సులువుగా జరిగేపని కాదు. తాను ఎప్పుడు మరణించినా గురువారం మాత్రమే మరణిస్తాను అంటూ ఆమె తన సన్నిహితులతో అంటూ ఉండేదట. దీనికి కారణం ఆమెకు షిరిడీ సాయి బాబా అంటే విపరీతమైన భక్తి. 

గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని కాంటెనెంటల్ హాస్పటల్ లో వైద్యం చేయించుకుంటున్నప్పుడు ఆమెకు వైద్యం చేసిన డాక్టర్లు ఆమెకు ఏమీ ఫర్వాలేదు అని ధైర్యం చెప్పినప్పుడు ఆమె చెప్పిన సమాధానం విని ఆమెకు వైద్యం చేసిన డాక్టర్లు ఆశ్చర్యపడినట్లు తెలుస్తోంది. తాను మరణం గురించి భయపడను అనీ అయితే తాను ఎప్పుడు చనిపోయినా బాబాకు అత్యంత ప్రీతి కరమైన గురువారం రోజున మాత్రమే చనిపోతాను అని చెప్పి గురువారం తెల్లవారుజామున చనిపోవడం యాధృశ్చికం అనుకోవాలి. 

కొద్ది సేపటి క్రితం విజయనిర్మల భౌతికకాయాన్ని సూపర్ స్టార్ కృష్ణ ఇంటికి తీసుకు వచ్చినప్పుడు అచేత స్థితిలో ఉన్న ఆమెను చూసి కృష్ణ కన్నీటి పర్యంతం అవ్వడం అందర్నీ కలిచివేసింది. ఇండస్ట్రీ ప్రముఖులు అందరు ఒకొక్కరుగా వస్తూ ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించి ఆమెతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుకు చేసుకుంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: