అఫీషియల్ బ్రేకింగ్ న్యూస్ : తెలుగు బిగ్ బాస్ -3 హోస్ట్ గా ఆయనే....!!

Mari Sithara
ఇటీవల రెండు సీజన్లతో వీక్షకులను ఆకట్టుకున్న లేటెస్ట్ బుల్లితెర షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 అతి త్వరలో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ ఎవరు, అసలు హోస్ట్ గా ఎవరు ఉండబోతున్నారు తదితర విషయాలపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ కొంత నిరాశకు గురయ్యారు. 

ఇక ఇటీవల విడుదల చేసిన ప్రోమోలో హోస్ట్ గా చేయబోయే నటుడి తాలూకు మొహం కనపడకుండా ఆ ప్రోమోని విడుదల చేసింది బిగ్ బాస్ యాజమాన్యం. అయితే ఆ ప్రోమో విడుదల తరువాత అసలు ఎవరు ఆ నటుడు అని అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. ఇక ఈ విషయమై నేడు వారు అధికారిక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇక ఈ షో సీజన్ 3 కి హోస్ట్ గా రాబోతోంది మరెవరో కాదు ఎక్కువమంది ఊహించనట్లుగా ఈ సీజన్ కు యువసామ్రాట్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా రాబోతున్నారు. 

కాసేపటి క్రితం అయన పాల్గొన్న లేటెస్ట్ ప్రోమోని బిగ్ బాస్ టీమ్ విడుదల చేయడం జరిగింది. ఇక కింగ్ నాగార్జున గారు ఈ సీజన్ కు హోస్ట్ గా రాబోతున్నారు అని తెలియగానే ప్రేక్షకుల్లోనూ ఈ సీజన్ ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఉత్కంఠ మాత్రం పెరుగుతుందని చెప్పవచ్చు. ఇక అతి త్వరలో షో ప్రారంభమయ్యే తేదీ కూడా వెల్లడి కానుందని, అలానే పార్టిసిపెంట్స్ విషయమై కూడా కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: