ఇటీవల తన కెరీర్ లోని 25వ సినిమాగా వచ్చిన మహర్షి సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు, సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్న విషయం తెలిసిందే ఇక ఆ సినిమా తరువాత అయన నటిస్తున్న 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు. యువ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు తమ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక అతి త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, సీనియర్ నటి శ్రీమతి విజయశాంతి ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా తరువాత మహేష్ నటించబోయే 27వ సినిమాపై కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఇక కొద్దిరోజుల క్రితం ఒక మీడియా ఇంటర్వ్యూలో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ, మహేష్ బాబు గారి కోసం ఒక స్టోరీ సిద్ధం చేయడం జరిగిందని, అతి త్వరలో దానిని వారికి వినిపించి, ఆయన ఒప్పుకుంటే మహేష్ గారి తదుపరి సినిమాగా దానిని ప్రారంభిస్తామని ఒక మాట చెప్పడం జరిగింది. ఇక మరోవైపు గీత ఆర్ట్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ మహేష్ ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారని, దానికి దర్శకుడిగా గీత గోవిందం దర్శకుడు పరశురామ్ ని తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.
అయితే నేడు కొన్ని మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తల ప్రకారం, పరశురామ్ ఇప్పటికే ఒక కథను మహేష్ బాబుకు వినిపించగా, ఆయనకు కథ బాగా నచ్చి తన డేట్స్ కూడా వెంటనే కేటాయించడం జరిగిందని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని పరశురామ్ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించగా, అది మెల్లగా బయటకు వచ్చినట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం పుకారవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది మంచి పండుగ లాంటి న్యూస్ అనే చెప్పవచ్చు....!!