సరిలేరు నీకెవ్వరులో అభిప్రాయ భేదాలు ?

Seetha Sailaja
మహేష్ అనీల్ రావి పూడిల క్రేజీ ప్రాజెక్ట్ ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ ఈవారం కాశ్మీర్ లో ప్రారంభం కాబోతోంది.  ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ లో కొన్ని కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో చిత్రీకరించబోతున్నారు. సుమారు 20 రోజులు కొనసాగే ఈ షెడ్యూల్ లో మహేష్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించడానికి మానసికంగా ప్రిపేర్ అవుతున్నాడు. ఇది ఇలా ఉండగా ఈమూవీ ప్రారంభం కాకుండానే నిర్మాత దిల్ రాజ్ మహేష్ ల మధ్య చిన్నపాటి గ్యాప్ ఏర్పడింది అన్న ప్రచారం జరుగుతోంది. 

ఇలా గాసిప్పులు రావడానికి ఈమూవీకి అనుకోకుండా పెరిగిపోయిన బడ్జెట్ అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో నటించిన మహేష్ పారితోషికం కింద ఈమూవీ నాన్ థియేటర్ రైట్స్ ఇచ్చిన నేపధ్యంలో ఆ రైట్స్ విలువ సుమారు 52 కోట్ల వరకు వుంటుందని అంటున్నారు. దీనితో ఈసినిమాను నిర్మిస్తున్న నిర్మాతలకు ఈమూవీ ధియేటర్ రైట్స్ వల్ల వచ్చే ఆదాయంతో లాభం రావలసి ఉంది. 

ఈమూవీ బడ్జెట్ ను మొదట్లో 70 కోట్ల లోపు పూర్తి చేయాలి అన్న అంచనాలతో ఈమూవీ ప్రాజెక్ట్ మొదలు పెట్టినట్లు టాక్. అయితే ఈమూవీ క్యాస్టింగ్ విపరీతంగా పెరిపోవడంతో ఈమూవీ బడ్జెట్ 90 కోట్లకు పెరిగి పోయిందని అంటున్నారు. దీనితో ఈమూవీని నిర్మిస్తున్న దిల్ రాజ్ ఈమధ్య మహేష్ తో సమావేశం అయి ఈ విషయాలను చర్చించినట్లు తెలుస్తోంది. ‘మహర్షి’ సినిమాకు వడ్డీల భారంతో పాటు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి పోవడంతో  ఒక కోటి నలభై లక్షలు దాటిపోవడంతో ఈమూవీని నిర్మించి కూడ తనకు పెద్దగా కలిసి రాలేదని దిల్ రాజ్ చెప్పిన నేపధ్యంలో మహేష్ దిల్ రాజ్ మాటలకు అడ్డు తగులుతూ తన రెమ్యూనిరేషన్ తగ్గించుకోవాలని దిల్ రాజు అభిప్రాయ పడుతున్నాడా అంటూ ఆరాలు తీసినట్లు టాక్. 

దీనితో షాక్ అయిన దిల్ రాజ్ ఒక చిన్న సినిమాను తాను నిర్మిస్తే కనీసం తనకు 5 కోట్లు మిగులుతుందని అలాంటిది ఇంత భారీ సినిమాను తీసుతున్నప్పుడు ఖర్చుల విషయంలో ఎలా ప్లాన్ చేయాలి అన్న విషయం మహేష్ తో చర్చించడానికి తాను వచ్చానని క్లారిటీ ఇస్తూ ఈమూవీకి తనతో పాటు మరొక నిర్మాత అనీల్ సుంకర కూడ ఉండటంతో తన అభిప్రాయాన్ని వివరించడానికి మాత్రమే తాను ఈ విషయాలను ఎత్తాను అంటూ మహేష్ తో తన భేదాభిప్రాయాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు హడావిడి చేస్తున్నాయి దీనితో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రారంభం కాకుండానే భేదాభిప్రాయాలు మొదలయ్యాయా అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: