ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు లివింగ్ రిలేషన్ షిప్. దీనికి ఎక్కవ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకరికొకరు అర్ధం చేసుకున్నాక అవసరం అనుకుంటే పెళ్లి చేసుకుంటారు. లేదంటే ఎవరిదారి వారిది. లివింగ్ రిలేషన్ షిప్ కు మారుపేరుగా మారింది బాలీవుడ్ జంట.
ఆ జంట ఎవరో ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుంది. ఇంకెవరు అర్జున్ కపూర్, మలైకా అరోరా. ఈ ఇద్దరు ఎప్పటి నుంచో సహజీవనం చేస్తున్నారు. మలైకా మాజీ భర్త అర్బాజ్ ఖాన్ నుంచి విడాకులు వచ్చే వరకు ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ ను బయటపెట్టలేదు.
కానీ, అర్బాజ్ నుంచి విడాకులు రావడంతో.. ఇద్దరు పబ్లిక్ ప్లేస్ లో కలిసి తిరుగుతున్నారు. విదేశాలకు స్వేచ్ఛగా వెళ్తున్నారు. రిలేషన్ షిప్, పెళ్లి గురించి ఈ ఇద్దరు బయటకు చెప్పలేదు. రీసెంట్ గా అర్జున్ కపూర్ వీరి రిలేషన్ షిప్ పై స్పందించాడు.
సహజీవనం చేస్తున్నట్టు బాహాటంగా చెప్పాడు. పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతానికి ఇద్దరం సహజీవనం చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి అందరికి తెలుసు. కాకపోతే ఎప్పుడు బయటపెడతారా అనుకున్నారు. అనుకున్నట్టుగానే బయటపెట్టారు. ఇక తెలియాల్సిందల్లా పెళ్లి ఎప్పుడు అన్నదే.