ఎన్టీఆర్.. రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించారు. రాజమౌళి ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. తెలుగు స్వాతంత్ర సమరయోధులు కొమరం భీం, అల్లూరి సీతారామ రాజు కథలతో సినిమా తెరకెక్కుతోంది.
పీరియాడికల్ స్టోరీ కాబట్టి దీనిపై అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కు కొద్దిగా బ్రేక్ ఇచ్చారు. రాజమౌళి యూఎస్ వెళ్లడం వలన వారం రోజుల బ్రేక్ వచ్చింది. రాజమౌళి అలా యూఎస్ వెళ్లారో లేదో.. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫోటో ఒకటి షేర్ అయ్యింది.
ఎన్టీఆర్ తలకు పాగా చుట్టుకొని లైట్ గడ్డంతో ఒక పక్కకు చూస్తున్న ఫోటో. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో అందరు షాక్ అయ్యారు. తీరా చూస్తే అది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని తేలింది. ఈ ఫోటో క్షణాల్లో వైరల్ కావడం విశేషం.
ఆర్ఆర్ఆర్ మూవీ ఈ ఫోటోను మెచ్చుకుంది. ఫ్యాన్ మేడ్ ఫోటో సూపర్ గా ఉందంటూ ట్వీట్ చేసింది. యువతలో టాలెంట్ ఎక్కువగా ఉంది. ఉన్న టాలెంట్ ను ఇలా ఉపయోగిస్తున్నారు. రాజమౌళి సైతం ఈ పోస్టర్ ను మెచ్చుకున్నారు సమాచారం. వచ్చే ఏడాది జులై 30 వ తేదీన ఈ మూవీ రిలీజ్ కాబోతున్నది.