బన్నీ కి కోపం తెప్పించిన సొంత స్టాఫ్..!
ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలో అల్లుఅర్జున్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడని టాక్. ఇది ఇలా ఉండగా.. తాజాగా బన్నీ సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. బన్నీ వ్యక్తిగత స్టాఫ్ కి సంబంధించిన ఓ వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో ఒక పార్టీ ఫోటో షేర్ చేశాడు. దీనిపై బన్నీ స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రతీ ఆదివారం ఉదయం లేచి చూస్తే.. శనివారం రాత్రి తన స్టాఫ్ మెంబర్స్ అందరూ పార్టీ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తాయని.. తన కంటే వాళ్ల లైఫ్ సంతోషంగా సాగిపోతుందని అన్నారు.
చివర్లో 'నన్ను కూడా పార్టీకి పిలవొచ్చు కదా' అనే కామెంట్ జోడించాడు. మొత్తంమీద బన్నీ సొంత స్టాఫ్ వీకెండ్ సమయంలో చాలా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో బన్నీకి భలే కోపం తెప్పించినటు అయ్యింది అని..సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది అయితే పెళ్లి అయిపోయిందా కదా బన్నీకి ఇంకా పార్టీ లు ఉండవు అంటూ కామెంట్లు పెడుతున్నారు.