'గ్యాంగ్ లీడర్' టైటిల్ మార్చే ఆలోచనలో నాని..!

shami
నాచురల్ స్టార్ నాని జెర్సీ తర్వాత ప్రస్తుతం చేస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్. నాని, విక్రం కుమార్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా టైటిల్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. సినిమా ముగింపుకు చేరుకోగా ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. నాని సరసన కొత్త అమ్మాయి ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. 


ఐదుగు అమ్మాయిల గ్యాంగ్ కు లీడర్ గా నాని కనిపిస్తాడట. అయితే ఈ సినిమాకు గ్యాంగ్ లీడర్ పెట్టిన చిత్రయూనిట్ కు ఆల్రెడీ గ్యాంగ్ లీడర్ సినిమా చేస్తున్న చిరంజీవి అభిమాని మాణిక్యం మూవీస్ అధినేత మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగష్టు 22న రిలీజ్ ప్లాన్ చేశారట. 


సినిమాలో దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న రైతు సమస్యల గురించి సినిమా కథ ఉంటుందని తెలుస్తుంది. అయితే నాని సినిమాకు గ్యాంగ్ లీడర్ అని పెట్టడంతో ఆ సినిమా కన్నా ముందే మాణిక్యం గ్యాంగ్ లీడర్ రిలీజ్ అవుతుండటంతో నాని టైటిల్ మార్చేస్తున్నారట. గ్యాంగ్ లీడర్ అన్నది నాని గ్యాంగ్ లీడర్ అని పెట్టాలని అనుకున్నారు. కాని అదంత సూట్ అవదని భావించి వేరే టైటిల్ వెతుకుతున్నాడట డైరక్టర్ విక్రం కుమార్.


ఈ సినిమాతో పాటుగా నాని ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో 'వి' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. నాని ఈ మూవీలో నెగటివ్ రోల్ చేస్తున్నాడు. నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: