లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ భామకు అవకాశాలు మెల్లిగా తగ్గిపోతున్నాయి. గత పదేళ్ళలా సినిమా ఇండస్ట్రీలో ఉన్నది. ఇంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకురావడం అంటే మామూలు విషయం కాదు. అందులో టాప్ హీరోలందరితో సినిమాలు చేసింది.
ఇప్పుడు అవకాశాలు తగ్గిపోతుండటంతో కాజల్ బిజినెస్ రంగంలోకి దిగింది. ముంబైలో ఇప్పటికే నగల వ్యాపారాన్ని ప్రారంభించింది. నగల వ్యాపారం అంటే ఎలాంటి ఢోకా ఉండదు. తప్పకుండా ఆ వ్యాపారం హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. వ్యాపారాన్ని పక్కన పెడితే.. కాజల్ తమిళంలో కూడా ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తోంది.
సౌత్, బాలీవుడ్ సినిమాల్లో నంటించిన కాజల్ కు హోలీవడ్ నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. హాలీవుడ్ లో ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని, త్వరలోనే ఈ అమ్మడు ఆ సినిమాలో చేస్తుందని అంటున్నారు. సినిమా కోసం హాలీవుడ్ వెళ్లనుందట.
అవకాశాలు ఎక్కడున్నా సరే వెళ్లడం మంచిదే కదా. ఇప్పటికే బాలీవుడ్ నుంచి అనేకమంది హీరోయిన్లు హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. మెప్పించారు కూడా. ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో మెరుపులు మెరిపిస్తోంది. సో, ఇప్పుడు చందమామ కూడా హాలీవుడ్ లో మెరుస్తుందన్నమాట.