జూనియర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టాప్ డైరెక్టర్ !

K Prakesh

జూనియర్ ఎన్టీఆర్ కు కాలం కలిసిరాలేదేమో అని అనిపిస్తోంది. కలిసి వస్తుందను కున్న దసరా పీడకల లా మారి రామయ్య తో చెడు అనుభవాన్ని ఇచ్చింది. జరిగిందేదో జరిగిపోయింది ఇక రాబోతున్న సినిమాలు గురించి ఆలోచిస్తున్న ఎన్టీఆర్ కు ‘మిర్చి’ సినిమా డైరెక్టర్ కొరటాల శివ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. తెలుస్తూన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ‘రబస’ కొంత వరకూ నడిచాక కొరటాల శివ దర్శకత్వంలో వచ్చే సంవత్సరం ప్రారంభం నుండి మరో కొత్త సినిమా ఎన్టీఆర్ చేయవలసి ఉంది.

అయితే రామయ్యా వస్తావయ్యాకు నెగిటివ్ టాక్ రావడంతో ఎన్టీఆర్ కెరియర్ కు సంబంధించిన కొత్త సినిమాల పై కూడా రకరకాల ఊహగానలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో దర్శకుడు కొరటాల శివకు ఎన్టీఆర్ ఫోన్ చేసి కధకు తుదిమెరుగులు సరిచేయవలసిందిగా జూనియర్ కోరినప్పుడు తాను ప్రస్తుతం యుటివి మోషన్ ప్రొడక్షన్స్ సినిమా స్క్రిప్ట్ విషయం పై పనిచేస్తున్నానని అందువల్ల ఈ స్క్రిప్ట్ పని పూర్తి చేసిన తరువాత జూనియర్ దగ్గరకు వస్తానని పోలైట్ గా చెప్పడంతో జూనియర్ షాక్ కు గురి అయ్యాడట.

ఇలా దర్శకుడు శివ ప్రవర్తించడానికి గల కారణం ప్రిన్స్ మహేష్ బాబు అని తెలుస్తోంది. వచ్చే నెలలో మొదలవుతున్న ‘ఆగాడు’ ను త్వరగా పూర్తి చేసి వీలైనంత త్వరలో కొరటాల శివ సినిమాకు ప్రిన్స్ పచ్చ జెండా ఊపడంతో దర్శకుడు శివ జూనియర్ కంటే ఇప్పుడు ఎక్కువగా క్రేజ్ ఉన్న మహేష్ బెటర్ అని రాత్రికి రాత్రి ప్లేట్ పిరాయించాడు అంటూ టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: