విజయ్ దేవరకొండ వెనక్కి తగ్గాడు.. కుర్రాడి స్పీడుకి బ్రేకులు పడ్డాయా..!

shami
టాలీవుడ్ లో ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫీవర్ పట్టుకుందని చెప్పొచ్చు. కేవలం నాలుగు సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు నుండి టాక్సీవాలా వరకు క్రేజె హిట్లు అందుకున్న విజయ్ దేవరకొండ తన ప్రతి సినిమా విషయంలో డేరింగ్ గా ఉండేవాడు.


అయితే ప్రస్తుతం చేసిన డియర్ కామ్రేడ్ విషయంలో మాత్రం కాస్త వెనక్కి తగ్గాడు. సినిమాకు మేము చేయాల్సింది చేశాం కష్టపడ్డాం మీకు నచ్చితే చూడండి అంటూ చెప్పే విజయ్ మొదటిసారి ఈ సినిమా రిలీజ్ కు పది రోజులు ముందునుండి టెన్షన్ మొదలైందని అన్నాడు. అంతేకాదు తన సినిమా రిలీజ్ రోజు టాక్ తో సంబంధం లేకుండా నిద్రపోయి మార్నింగ్ షో పడ్డాక ఫోన్ లిఫ్ట్ చేసి టాక్ తెలుసుకునే వాడిని కాని ఈ సినిమాకు రిలీజ్ రోజు నిద్ర పట్టేట్టు లేదని అన్నాడు విజయ్.


విజయ్ దేవరకొండ అందరి లాంటి వాడు కాదు ఈ హీరోకి డేరింగ్ ఎక్కువ అని అనుకున్నాం. కాని అతను కూడా రెగ్యులర్ హీరోల మాదిరిగానే నిద్ర లేదు అంటూ సెంటిమెంట్ తో కొడుతున్నాడు. రీసెంట్ గా తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమా దొరసాని ఈవెంట్ లో కూడా ఎప్పుడు లేనిది చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు విజయ్.


చూస్తుంటే విజయ్ కూడా అందరి లానే తన పంథా మార్చుకున్నాడా అని డౌట్ పడుతున్నారు. అతి తక్కువ కాలంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తో తన హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. మరి అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: