శ్రీహరి కొడుకు హీరోగా పాస్ అయ్యాడా.. అతనిలో ప్లస్, మైనస్ లేంటి..?

shami
ఇండస్ట్రీలో నట వారసుల హవా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మరో నట వారసుడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అతనే రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి. శ్రీహరి మరణం తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చిన శ్రీహరి ఫ్యామిలీ ఫైనల్ గా శ్రీహరి చిన్న కొడుకుని హీరోగా ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 


అర్జున్, కార్తిక్ ఇద్దరు దర్శకులు కలిసి చేసిన రాజ్ దూత్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మేఘాంశ్. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. సినిమా కథ ఓ బైక్ చుట్టూ తిరగడం.. కథనంలో కొంత లాజిక్ మిస్ అవడంతో రాజ్ దూత్ చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.


అయితే సినిమా ఫలితం పక్కన పెడితే మేఘాంశ్ శ్రీహరి మాత్రం ఇంప్రెస్ చేశాడని తెలుస్తుంది. తనకు ఇచ్చిన సంజయ్ పాత్రని మేఘాంశ్ శ్రీహరి తన శక్తి మేరకు నటించి మెప్పించాడని అంటున్నారు. శ్రీహరి కొడుకుగా నటన తన రక్తంలో ఉందని కొందరు రియల్ స్టార్ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. అయితే డ్యాన్స్, ఫైట్స్ ఓకే కాని ఎమోషనల్ సీన్స్ లోనే కొద్దిగా తడబడ్డాడని అంటున్నారు.


మొదటి సినిమాకు అది కామనే.. ఓ విధంగా రాజ్ దూత్ మేఘాంశ్ కు మంచి ఎంట్రీ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ సినిమా ఇచ్చిన ఎక్స్ పీరియన్స్ తో అతను మునుముందు మంచి సినిమాలు చేసి అద్భుత విజయాలను అందుకోవాలని ఆశిద్దాం.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: