చెన్నై చిన్నది త్రిష మూడున్నర పదుల వయసు దాటేసి నాలుగు పదుల వయస్సుకు చేరువవుతోంది. టాలీవుడ్ లో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం తరుణ్ సినిమాతో పరిచయం అయిన ఆమెకు వర్షం సినిమాతో మంచి గుర్తింపు దక్కింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది సీనియర్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు వరుస పెట్టి అందరితోనూ ఆడి పాడేస్తుంది. దక్షిణాదిలో అందరు అగ్ర హీరోలతో పాటు నేటి తరం కుర్ర హీరోలతో ఆమె ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తోంది.
మధ్యలో కెరీర్ పరంగా ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురు చూసిన ఆమె టాలీవుడ్లో ఓ బడా కుటుంబానికి చెందిన హీరోతో ప్రేమాయణం నడిపిన సంగతి అందరికీ తెలిసిందే. వారిద్దరూ కలిసి ఎన్నోసార్లు తెలుగు మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. ఆ తర్వాత తమిళనాడుకు చెందిన ఓ పారిశ్రామికవేత్తతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాక... వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఇది జరిగి కూడా మూడు నాలుగేళ్లవుతున్నా త్రిష మళ్లీ పెళ్లి అన్న మాటే ఎత్తడం లేదు.
ట్విస్ట్ ఏంటంటే ఆమె తిరిగి టాలీవుడ్‌కు చెందిన తన మాజీ ప్రియుడు అయినా ఆ హీరోకు మళ్లీ దగ్గర అయిందట. తాజాగా ఆమె బీచ్ దగ్గర క్లోజప్‌గా ఓ హాటెస్ట్ ఫొటోలో చాలా హాట్‌గా అందాలు ఆరబోస్తోంది. ఈ ఫొటో చూస్తే ఈ వయస్సులో కూడా ఆమె వన్నె ఏ మాత్రం తగ్గలేదనిపిస్తోంది. ఆమె నాజూకు అందాలు అన్నీ అలాగే ఉన్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ సీనియర్లతో పాటు యంగ్ హీరోలతోనూ ఆమె నటిస్తోన్న సంగతి తెలిసిందే.