ఎట్టకేలకు భారతీయుడు 2 ..సినిమా రెండవ షెడ్యూలు...
దర్శకుడుకి, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారికి బడ్జెట్టు విషయంలో అభిప్రాయభేదాలు రావడంతో ఇది ఆగిపోయిందంటూ వార్తలొచ్చాయి. ఇటీవల వీరు కూర్చుని మాట్లాడుకున్నారని, పరిమితమైన బడ్జెట్టులో పూర్తి చేయడానికి దర్శకుడు అంగీకరించాడనీ, ఆగస్టు నుంచి షూటింగ్ తిరిగి మొదలవుతుందని తాజా సమాచారం.
ప్రస్తుతం కమల్ తన సొంత నిర్మాణంలో అక్షరహాసన్ , అభిహాసన్ జంటగా నటిస్తున్న చిత్రం మిస్టర్ కె.కె. చియాన్ విక్రమ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి విలక్షన నటుడు కమల్‌హాసన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జులై 19న విడుదల కాబోతున్న సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ బిజీలో ఆయనున్నారు. ఈ చిత్రం మంచి హిట్ అయి అటు ఇందులో నటించిన నటీనటులకు, కమల్‌హాసన్ కు మంచి సక్సెస్రావాలని కోరుకుందాం.