సమంత ఫింగర్ రింగ్ స్టోరీ !!
సమంత కొద్ది రోజుల క్రితం చెన్నై లో ఒక ప్రముఖ ఇంగ్లిష్ పత్రిక ఏర్పాటు చేసిన అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొని బెస్ట్ హీరోయిన్ గా అవార్డు కూడా అందుకుంది. అయితే ఇందులో ఏముంది విశేషం అనుకోవద్దు. ఇక్కడ ఒక పెద్ద విశేషాన్ని కోలివుడ్ మీడియా పసిగట్టి ఆమె చేతికి ఉన్న డైమండ్ ఉంగరం పై ఫోటోలు క్లిక్ మని పించి ఆఫోటోలను ప్రింట్ మీడియా వెబ్ మీడియాలలో పెట్టి నానా హడావిడి చేస్తోంది. ఇంతకీ ఈఫోటోలో విషయం ఏమిటంటే సమంత తన ఎడమచేతి వేలుకు పెట్టుకున్న డైమండ్ రింగ్ తో ఈ ఫంక్షన్ లో తళుక్కున మెరిసింది.
ఇంకేముంది అందంగా కనిపిస్తున్న ఈ డైమండ్ రింగ్ గురించి రకరకాల కధనాలు మీడియాలో రావడం మొదలైపోయింది. కొందరైతే ఈ డైమండ్ రింగ్ సమంతా-సిద్దర్ధాల నిశ్చితార్దానికి సంబంధించింది అంటూ వార్తలు వ్రాస్తే మరికొందరు సమంత ప్రియ స్నేహితుడు సిద్దూ ఇచ్చిన గిఫ్ట్ ఇది అంటూ వార్తలు వ్రాసారు. అయితే ఇదేమి కాకుండా సమంత ప్రస్తుతం డైమండ్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చు కుంటోంది కాబట్టి మరెవరైనా ఆమె అభిమాని ఇలా డైమండ్ రింగ్ ఇచ్చిన అవకాశం లేకపోలేదు. ఎదిఎమైనా సమంత పెట్టుకున్న ఆ డైమండ్ రింగ్ కోలీవుడ్ మీడియాకు బోలెడు గాసిప్ లను తెచ్చి పెట్టింది..