సాహో ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చురుగ్గా సాగుతున్నాయి. సినిమా ఆలస్యానికి విజువల్ ఎఫెక్ట్స్ కారణం అని అంటున్నారు. ఆగస్టు 15 వ తేదీ నుంచి పోస్ట్ ఫోన్ కావడంతో శర్వానంద్ రణరంగం, అడవి శేషు ఎవరు సినిమాలు ముందుకు వచ్చాయి. స్వాతంత్ర దినోత్సవం రోజున రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి.
ఇప్పుడు సాహో ఎఫెక్ట్ నాని గ్యాంగ్ లీడర్ పై పడింది. గ్యాంగ్ లీడర్ డేట్ ను చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కానీ, సాహో అనుకోకుండా పోస్ట్ ఫోన్ కావడంతో నాని తన సినిమాను సెప్టెంబర్ 13 కు వాయిదా వేసుకోవాలని చూస్తున్నారు.
ఆగష్టు 30 వ తేదీన మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి సూర్య బందోబస్త్ కాగా రెండోది కిచ్చ సుదీప్ పహిల్వాన్. సూర్య బందోబస్త్ మొదట ఆగష్టు 15 న అనుకున్నారు. సాహూ ఉండటంతో ఆగష్టు 30 కి వాయిదా పడింది.
ఇప్పుడు సాహూ కూడా వాయిదా పడటంతో సినిమాను ప్రీ ఫోన్ చేయలేరు కాబట్టి సెప్టెంబర్ 13 కు వాయిదా వేసుకుంటారని సమాచారం. అటు కిచ్చ సుదీప్ కూడా సెప్టెంబర్ 13 కి రావాలని అనుకుంటున్నారు. సాహో వాయిదా ఎంతమంది తలరాతలను మార్చేస్తుందో చూశారా.