దిల్ రాజ్ షాకింగ్ న్యూస్ !!

K Prakesh

చిన్న డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుండి బడా ప్రొడ్యూసర్ గా ఎదిగిన దిల్ రాజ్ ఏదైనా ఒక సినిమా కొనుగోలుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రము లోని మిగతా బయ్యర్లు గుడ్డిగా అనుసరించేవారు. అయితే ‘రామయ్యా వస్తావయ్యా’ అనుకోని ఘోర పరాజయాన్ని మూట కట్టుకొవడంతో దిల్ రాజ్ లెక్కలు కూడా తప్పుతాయి అనే భావన చాలామంది బయ్యర్లలో ఏర్పడింది.

ఈ పరిస్థుతుల నేపధ్యంలో ప్రస్తుతం టాలీవుడ్ ఫ్లాప్ హీరోల లిస్టులో ముందు వరుసలో ఉన్న సందీప్ కిషన్, వరుణ్ సందేష్ లు హీరోలుగా నటిస్తున్న ‘డి ఫర్ దోపిడీ’ నైజాం రైట్స్ కొనుక్కోవడం అందర్నీ ఆశ్చర్య పరచడమే కాకుండా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా మార్కెట్ కాని ఈ సినిమా పై దిల్ రాజ్ కు ఎందుకు ప్రేమ ఏర్పడింది అంటూ ఆశక్తికర చర్చలు కూడా వినపడుతున్నాయి. ఈ మధ్య పెద్ద హీరోలతో నిర్మించిన ‘ఎవడు’ తో సమస్యలు ‘రామయ్య’ తో నష్టాలు వచ్చాయి కాబట్టి పెద్ద హీరోల చుట్టూ భజన చేసేకన్నా, చిన్న హీరోల సినిమాల పై రిస్కు చేయడం మంచిదని దిల్ రాజ్ ఈ సాహసం చేస్తున్నాడు అంటూ టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

హీరో నాని నిర్మాతగా ఈ సినిమాకు పెట్టుబడి పెట్టి సాహసం చేస్తూ ఉంటే డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజ్ మరో సాహసం చేస్తున్నాడు అంటూ ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: