కావాల్సినంత వివాదంతో నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ 3 సీజన్ విజయవంతంగా స్టార్ట్ అయింది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ తో 100 రోజులపాటు జరిగే ఈ షోలో ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తయ్యాయి. బిగ్ బాస్ 3లో అప్పుడే అదిరిపోయే ట్విస్ట్ ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ హాట్ హీరోయిన్ వైల్డ్ కార్డు ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతుందట. ఇప్పటికే శ్రీముఖి, పునర్నవి భూపాలం, అషు వంటి కంటెస్టెంట్ ఉన్నప్పటికీ గ్లామర్ కంటెంట్ మరింత పెంచడం కోసం బిగ్ బాస్ నిర్వాహకులు ఈ సారి మరొక హాట్ బ్యూటీని బిగ్ బాస్ హౌస్ లోకి పంపనున్నారట.
ఆ హాట్ హీరోయిన్ ఎవరో కాదు శ్రద్ధా దాస్. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది యంగ్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా... కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన శ్రద్దా దాస్‌కు హాట్ ఇమేజ్ ఉంది. చాలా సినిమాల్లో తన అందచందాలతో ప్రేక్షకులకు మంచి కిక్కెక్కించింది. ఇప్పుడు ఒకరు ఎలిమినేట్ అయిన వెంటనే ఆమెను హౌస్‌లో ప్రవేశపెడుతున్నారట.
ముందుగా షో నిర్వాహకులు హాట్ డ్యూటీ హెబ్బా పటేల్ ని బిగ్ బాస్ లోకి తీసుకొద్దామని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల హెబ్బా పటేల్ బిగ్ బాస్ కి నో చెప్పిందట. కాబట్టి ఆమె స్థానంలో శ్రద్ధాదాస్ ని రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. శ్రద్ధ కూడా షోలోకి ఎంట్రీ ఇస్తే హౌస్‌కు మరింత గ్లామర్ కళ రావడం ఖాయం. ఇప్పటికే రంగంలో ఉన్నవారితో పోలిస్తే శ్రద్ధ కూడా కాంట్రవర్సీలు క్రియేట్ చేయడంలో కాస్త ముందే ఉంటుందనడంలో సందేహం లేదు.