‘బిగ్ బాస్ 3’ షోకు సంబంధించి హోస్ట్ గా నాగార్జునకు నిన్న మొదటిపరీక్ష ఎదురైంది. ఈ షోకు సంబంధించి ప్రతి శని ఆది వారాలలోను హౌస్ మేట్స్ తో ఆటలాడుకునే పనిని చేపట్టిన నాగ్ నిన్నరాత్రి తన మొదటి పరీక్షను చాల విజయవంతంగా పూర్తి చేసాడు.
తన సహజ సిద్ధమైన చలాకి తనంతో హడావిడి చేసిన నాగ్ హౌస్ మేట్స్ అందరితోను చాల చనువుగా మాట్లాడటమే కాకుండా వారందరినీ టార్గెట్ చేస్తూ చాల సెటైర్లు వేసాడు. ఈ సందర్భంలో నాగార్జున హౌస్ మేట్స్ తో ఆడించిన పిల్లో గేమ్ నిన్నటి షోకు హాట్ టాపిక్ గా మారింది.
మ్యూజిక్ ప్లే చేస్తూ హౌస్ మేట్స్ సభ్యుల మధ్య ఈ పిల్లోను రొటేట్ చేస్తూ ఆ మ్యూజిక్ ఎక్కడ ఆగుతుందో అక్కడ ప్రతి హౌస్ మేట్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసాడు. ముఖ్యంగా ఈ షోలో ఎంటర్ అయిన నిజజీవితంలోని భార్య భర్తలు వరుణ్ సందేశ్ వితికలను ఒక ఆట ఆడుకున్నాడు నాగార్జున.
ముఖ్యంగా వీరిద్దరి బాత్రూమ్ టబ్ రోమాన్స్ గురించి నాగార్జున చాల చిలిపి ప్రశ్నలు వేసాడు. అయితే వితిక నాగ్ మాటలకు ధీటుగా సమాధానం ఇస్తూ అది తమ థింకింగ్ టబ్ అంటూ సద్దుబాటు వివరణ ఇచ్చింది. అయితే నాగార్జున మరింత రేచ్చిపోతు వితికను బిగ్ బాస్ ఇంటి నుంచి పంపకుండా వరుణ్ సందేశ్ చాల తెలివిగా ఆలోచిస్తున్నాడు అంటూ జోక్ చేయడంతో ఈరోజు ఎలిమినేషన్ లో వితిక ఉండదు అన్న సంకేతాలు వచ్చాయి. ఈనాటి ఎలిమీనేషన్ ప్రక్రియలో పునర్నవికి ఎక్కువ ఓట్లు వచ్చాయి అని చెప్పడంతో ఆమె సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతే ఈరోజు ఎలిమినేట్ కాబోయే వ్యక్తి ఎవరు అన్న సస్పెన్స్ ను కొనసాగించడంలో నాగార్జున నూటికి నూరు శాతం సక్సస్ అయ్యాడు..