‘డియర్ కామ్రేడ్’ మూవీ కలక్షన్స్ రెండవరోజు కూడ సంతృప్తిగానే వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈమూవీ పై బిసి సెంటర్ల ప్రేక్షకులు నిర్లిప్తత వ్యక్త పరచడంతో ఈమూవీకి విజయ్ కోరుకునే రికార్డ్ బ్రేకింగ్ కలక్షన్స్ వచ్చే ఆస్కారం చాల తక్కువగా కనిపిస్తోంది. దీనికితోడు ఈమూవీ నిడివి పెద్దది కావడంతో ఈమూవీని చూసే రిపీట్ ఆడియన్స్ చాల తక్కువగా ఉండే ఆస్కారం ఉంది.
ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే విజయ్ దేవరకొండ నటిస్తున్న ఒక సినిమా ఇంచుమించు ఆగిపోయింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పరోక్షంగా విజయ్ కూడ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం మైత్రీ మూవీస్ సంస్థ విజయ్ దేవరకొండ హీరోగా ఇప్పటికే మొదలు పెట్టిన ‘హీరో’ మూవీ ఆగిపోయింది అని ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.
ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ బైక్ రేసింగ్ నేపధ్యంలో ఉంటుంది. ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన ఒక భారీ ఎపిసోడ్ ను ఢిల్లీలో విదేశీ టెక్నిషియన్స్ రప్పించి భారీ ఖర్చుతో తీసాడు. కేవలం ఈ ఒక్క షెడ్యూల్ కోసమే నిర్మాతలు 4 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సీన్స్ సుమారు 10 రోజులు తీసినా చివరకు ఆ సీన్స్ లో సినిమాకు పనికి వచ్చే సీన్స్ రెండు నిముషాలు మాత్రమే మిగిలాయి అని టాక్.
దీనికితోడు ఈమూవీ కథ కూడ ఒక హాలీవుడ్ మూవీలా భారీ యాక్షన్ సీన్స్ తో ఉంటుంది కాబట్టి ఇలాంటి భారీ యాక్షన్ సీన్స్ కలిగి ఉన్న ‘సాహో’ రిజల్ట్ బట్టి ఈమూవీ గురించి ఆలోచన చేద్దాము అని నిర్మాతలతో పాటు విజయ్ దేవరకొండ కూడ భావిస్తున్నట్లు టాక్. అంతేకాదు ఈమూవీ దర్శకుడును మార్చే ఆలోచన కూడ ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ నేర్పించిన పాఠాలతో ఆమూవీలోని భారీ ఎమోషనల్ సీన్స్ విషయంలో కూడ విజయ్ దేవరకొండ మరొకసారి ఆలోచిస్తాడు అన్న ఆలోచనలు చేస్తాడు అన్న వార్తలు వస్తున్నాయి..