మ‌హేష్‌తో సినిమా.... టాలీవుడ్ దండం పెట్టేస్తోందా..

VUYYURU SUBHASH
సూపర్ స్టార్ మహేష్ బాబు - వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా త‌ర్వాత సుకుమార్‌తో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమా క్యాన్సిల్ కావడంతో మహేష్ బాబు..సుకుమార్ పక్కకు తప్పుకోవడంతో మహేష్ నెక్ట్స్ మూవీ మ‌రో సారి అనిల్ రావిపూడితో దాదాపు ఖరారైంది. అయితే మ‌హ‌ర్షి సినిమాకు ముగ్గురు నిర్మాత‌లు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు అటు మ‌హేష్ బాబు భారీ రెమ్యూన‌రేష‌న్ ఇటు వంశీ వేస్టింగ్ ఖ‌ర్చ‌ల‌తో బ‌డ్జెట్ పెర‌గ‌డం వ‌ల్ల  వంద కోట్లు షేర్ వచ్చినా నిర్మాత‌ల‌కు ఏం మిగ‌ల‌లేదు.


అయితే ప్ర‌స్తుతం ఈ సినిమాకు కూడా దిల్ రాజునే నిర్మాత‌గా ఉంటున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు తీసుకుంటున్న రెమ్యూన‌రేష‌న్‌ హాట్ టాపిక్‌గా మారింది.  ఈ సినిమాకు మ‌హేష్ రూ.50 కోట్లు పైగా ఉంటుందని సమాచారం. నిజానికి మ‌హేష్ రెమ్యూన‌రేష‌న్ వ‌ద్దు.. నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ కావాల‌ని ప‌ట్టుప‌ట్టార‌ట‌. గ‌తంలో చిరంజీవి లాంటి వాళ్లు నైజాం రైట్స్ తీసుకునేవారు.


ఇక ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు రెమ్యున‌రేష‌న్ విష‌యంలో కొత్త కోరిక‌లు కోరుతున్నారు. ఏరియా రైట్స్ పోయి మొత్తం నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ అంటున్నారు. ఇప్పుడు నాన్ థియేట్రిక‌ల్ రైట్స్‌కే మ‌రింత క్రేజ్ పెరిగింది. శాట్‌లైట్‌, డిజిట‌ల్ మ‌రియు డ‌బ్బింగ్ ఇలా ఇక్క‌డ‌కే 50 కోట్లు వ‌స్తున్నాయి. అంటే ఇవ‌న్నీ క‌లిపి హీరోల జేబుల్లోకి వెళ్లిపోతే ఇక నిర్మాత‌లకు క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు.


నిర్మాత‌ల‌కు ల‌భాలు వ‌చ్చేయి కేవ‌లం థియేట్రిక‌ల్ రైట్స్ మాత్రం. దీంతో ఒక్క హీరోనే ఇంత తీసుకుంటే మాకు ఏంటి మిగిలేది? మిగిలిన వాళ్ల‌కి ఏమి ఇవ్వాలి? అని అనుకుంటున్నారు. అయితే మ‌రి మొత్తానికి అనిల్ రావిపూడి సినిమాతో మహేష్..తన పారితోషకం విషయంలో నిజంగానే అంద‌రికి షాక్ ఇస్తున్నాడు. ఇప్పుడు మ‌హేష్‌తో సినిమా అంటేనే మిగిలిన నిర్మాత‌లు కూడా భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఇక ఇప్పుడు మ‌హేష్‌ను చూసి బ‌న్నీ లాంటి వాళ్లు కూడా ఇదే రూట్లో వెళుతున్నార‌ట‌.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: