పవన్ పుస్తక ప్రపంచం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఈ పేరొక సంచలనం. గత పది సంవత్సరాలుగా విజయం లేకపోయినప్పటికీ ఆయన క్రేజ్ కించిత్తు కూడా తగ్గలేదనటం అతిశయోక్తి కానే కాదు. గత సంవత్సవరం గబ్బర్ సింగ్, ఈ ఏడాది అత్తారింటికి దారేది తో అయన సృష్టించిన హంగామా అంత ఇంత కాదు. మరి పది సంవత్సరాలు విజయం లేకపోయినా ఆయన మనోస్థైర్యం కోల్పోకుండా ఉన్నారంటే అది ఆయన వ్యక్తిత్వం వల్లనే సాధ్యం అయినది.
కళ్యాణ్ ఎక్కువగా ఎవరితో కలవరట, ఎప్పుడు ఒంటరిగ తన గదిలోనో, ఫార్మ్ హౌస్ లోనే పుస్తకాలు చదువుతూ గడిపెస్తాడట. కళ్యాణ్ అన్ని రకాల పుస్తకాలు చదువుతారు. ఆధ్యాత్మిక, సంఘీక, సామజిక, విప్లవాత్మక, కాల్పనిక, జీవిత గాథ పుస్తకాలు అన్ని చదువుతారు. ఆయనకీ బాగా నచ్చిన పుస్తకాలలో కొన్నిటిని ఇక్కడ తెలియచెస్తున్నాం.
యోగానంద ఒక యోగి ఆత్మకథ, గోపీచంద్ అసమర్ధుని జీవిత యాత్ర, తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి, చేగువేరా జీవిత చరిత్ర, గాంధీ సత్య శోధన, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా ఆత్మకథ ఆయనని చాల ప్రేరేపించిన పుస్తకాలలో కొన్ని. ఈ మధ్య జరిగిన వేడుక లో కళ్యాణ్ తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి లోని కొన్ని వాక్యాలు సభాముకముగా చెప్పటం జరిగింది. తెలుగు సిని జగత్తులో ఇప్పుడు ఉన్న హీరోలలో ఇలా పుస్తక జ్ఞానం కలిగిన హీరో కళ్యాణ్ ఒక్కడేనేమో.