రాక్షసుడు: బెల్లంకొండ శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన ఈ సినిమా గత శుక్రువారం రిలీజ్ అయింది. మొదటి మూడు రోజుల్లోనే 6 కోట్ల వసూళ్లు రాబట్టింది. తమిళంలో హిట్ కొట్టిన 'రాచ్చసన్' సినిమాకు రీమేక్ గా తెలుగులో 'రాక్షసుడుస సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుని వసూళ్ల పరంగా అదే ఫ్లోతో దూసుకుపోతుంది.
ఇస్మార్ట్ శంకర్: రామ్- పూరీ జగన్నాథ్ కంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టుకుని టాప్ 1లో నిలిచింది. జూలై 18న విడుదల అయిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు.
ఓ బేబీ: సమంత అక్కినేని ప్రధాన పాత్రలో పోషించిన ఓ బేబి సినిమా ఎవరూ ఊహించిన విధంగా సక్సెస్ అయింది. మొదటివారంలోనే 11 కోట్ల వసూళ్లతో దూసుకుపోయింది. ఈ చిత్రం తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుని మొత్తంగా 15 కోట్ల వసూళ్లను అందుకుంది. సమంత క్రేజ్ మరుయు మార్కెట్ ఈ సినిమాకు బాగా ఉపయోగపడ్డాయి.
బ్రోచేవారెవరురా: వివేక్ ఆత్రేయ దరశకత్వంలో అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం బ్రోచేవారెవరురా. సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్లో తీసిన ఈ సినిమా 15 కోట్ల వసూళ్లతో మంచి టాక్ తెచ్చుకుంది.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ: స్వరూప్ ఆర్ఎస్జే దర్వకత్వంలో టాలీవుడ్లో అలరించిన చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. నవీన్ పొలిశెట్టి, శ్రుతి శర్మ, సుహాస్ ప్రధాన పాత్రలో నటించారు. ముందుగా రిలీజ్ అయిన ట్రైలర్లు, టీజర్లతో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా 10 కోట్ల కలెక్షన్స్‌తో బాగా రాబట్టుకుంది.
మహర్షి: వంశీ పైడిపల్లి- సూపర్ స్టార్ మహేష్ బాబు కాండినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం మహర్షి. మహేష్ 25వ సినిమాగా తెరకెక్కిన మహర్షి సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది. ఇక 100 కోట్ల షేర్స్‌ను రాబట్టుకుని రికార్డు క్రియేట్ చేసింది.
అవెంజర్స్ ఎండ్ గేమ్: హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్‌ను తెలుగులో డబ్ చేసి బారీగా రిలీజ్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున కలెక్షన్లు కుమ్మేస్తోంది. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. బయ్యర్లకు డబుల్ ఫాఫిట్ అందించింది.
కాంచన 3: టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న రాఘవ లారెన్స్ కాంచన 3 మంచి థిల్లర్ అండ్ హోరర్ సినిమా కావడంతో 300 కోట్ల భారీ వసూళ్లు రాబట్టుకుని రికార్డు క్రియేట్ చేసింది.
జెర్సీ: నాచురల్ స్టార్ నాని మరియు కన్నడ బ్యూటీ శ్రద్ద శ్రీనాథ్ జంటగా నటించిన సినిమా జెర్సీ. గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా 28కోట్ల షేర్స్ రాబట్టుకుంది.
చిత్రలహరి: కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా చిత్రలహరి. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేథురాజ్ హీరోయిన్లుగా నటించారు. లూజర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 14కోట్ల షేర్స్‌ను రాబట్టుకుని మంచి టాక్ తెచ్చుకుంది.
మజిలీ: శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య- సమంత జంటగా నటించిన ప్రేమకథ చిత్రం మజిలీ. పెళ్లి తర్వాత కలిసి నటించిన ఈ జంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వసూళ్ల పరంగా కూడా 37.2కోట్ల కలెక్షన్స్ రాబట్టుకుంది.
చీకటి గదిలో చితకొట్టుడు: సంతోష్ పి. జయకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆదిత్, నిక్కి తంబోలి, హేమంత్, తాగుబోతు రమేష్, ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమాకు పెట్టిన ఖర్చ కంటే అధిక లభాలే పొందింది.
కళ్యాణ్ రామ్ 118: సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్, నివేదా థామస్, శాలిని పాండే ముఖ్య పాత్రలో నటిస్తారు. నిర్మాలు సొంతంగా రీలిజ్ చేసుకోవడం వల్ల 10 కోట్ల షేర్స్‌ను రాబట్టుకుంది.
F2: ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్ చిత్రంలో విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ కలిసి నటించారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని జనవరి 11న విడుదల చేశారు. మల్టీ స్టారర్‌గా వచ్చిన ఈ సినిమా 79కోట్ల భారీ వసూళ్లు రాబట్టుకుంది. వెంకటేష్ మరియు వరుణ్‌కు పెద్ద హిట్ అందించింది.