కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న సాహో..!
ఇంత తక్కువ సమయంలో ఇన్ని లైక్స్ రావడం టాలీవుడ్ చరిత్రలోనే మొదటిసారి. అప్పట్లో ప్రభాస్ నటించిన “బాహబలి2” ట్రైలర్ కే ఈ ఫీట్ అందుకోడానికి 73 నిముషాలు పట్టింది.ఇప్పుడైతే మొట్టమొదటి స్థానంలో “సాహో” రెండవ స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “అరవింద సమేత వీర రాఘవ” ట్రైలర్ 67 నిముషాలు ఆ తర్వాత “బాహుబలి 2″లు మూడవ స్థానంలో నిలిచాయి.
దీన్ని బట్టే మనం అర్ధం చేసుకోవచ్చు “సాహో” జనం ఎలా ఎదురు చూస్తున్నారు అన్నది.మరి సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డులు సొంతం చేసుకుంటుందో చూడాలి. మొత్తంమీద సినిమా విడుదల కాకముందే కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తోంది సాహో. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 30వ తారీఖున విడుదల అవటానికి సిద్ధంగా ఉంది. అయితే చాలా కాలం తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమా ట్రైలర్ విడుదల కావటంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ప్రభాస్ అభిమానులు పండగ చేసుకున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.