తెలుగు అమ్మాయిలకి అవకాశాలిస్తే ఇలాగ ఇరగదీస్తారా
కె.ఎస్.రామారావు మాట్లాడుతూ ``మా సినిమాలో ఐశ్వర్య, రాజేంద్ర్రప్రసాద్ పాత్రలే హీరోలు. ఐశ్వర్య చాలా గొప్పగా, అద్భుతంగా నటించింది. మా సినిమా ఎప్పుడో సిద్ధమైనప్పటికీ, ప్రతి వారం ఎన్నో కొన్ని సినిమాలు విడుదలకు ఉండటం వల్ల మేం విడుదల చేయకుండా ఆగాం. ఆగస్టు 23న పెద్ద సినిమాలు లేవని, మా సినిమానే పెద్ద సినిమా అవుతుందని డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు. ఈ సినిమాను రెండున్నర గంటల సేపు ఐశ్వర్య తన భుజాలపై మోసింది. పాటలకు చాలా మంచి స్పందన వస్తోంది. తెలుగులోనూ పెద్ద హిట్ కావాలి. భీమినేని గారు ప్రతి ఫ్రేమ్‌ను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. హనుమాన్ చౌదరి రాసిన మాటలు చిత్రానికి హైలైట్ అవుతాయి`` అని అన్నారు. అలాగే ఐశ్వర్యరజేష్ తెలుగమ్మాయి అయి ఉండి కూడా వేరే భాషల్లోనే ఆమె ఎక్కువ సినిమాల్లో నటించింది. తెలుగులో ఇన్ని చిత్రాల తర్వాత అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలుగమ్మాయిలకి ఎక్కువ అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
హనుమాన్ చౌదరి మాట్లాడుతూ ``నేను భీమినేని సార్‌తో `సుడిగాడు` చిత్రానికి పనిచేశాను. ఆ తర్వాత ఆయనతో కలిసి పనిచేయడం ఇదే. మధ్యలో `కెజీఎఫ్`కు నేను రాసిన డైలాగులకు మంచి పేరు వచ్చింది. `కౌసల్య కృష్ణమూర్తి` మంచి కథ. తండ్రీ - కూతుర్లు ఒకరికొకరు చేసుకునే సహకారం, ఎదగాలని పడే తాపత్రయం ఆకట్టుకుంటాయి`` అని తెలిపారు.