రజనీకాంత్ తో – పవన్ ను – పోల్చిన నాగబాబు !

K Prakesh
మెగా బ్రదర్ నాగబాబు ఈ రోజు తన పుట్టినరోజు సదర్భంగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పై తన అభిప్రాయాని మెగా అభిమానులకు తెలియచేసాడు. దక్షిణాదిన పవన్ కళ్యాణ్ తర్వాత ఆ స్థాయి నటుడు పవన్ కళ్యాణ్ మాత్రమే అంటూ పవన్ ను ఒకే మాటతో రజనీ పక్కన నిలబెట్టేసాడు నాగబాబు. ఈరోజు పవన్ కెరియర్ టాప్ లెవల్ లో పరుగుతీస్తోందని, ఈస్థితిలో పవన్ రాజకీయాల్లోకి వచ్చి తన సినిమా కెరీర్ ను నాశనం చేసుకోడని ఆయన స్పష్టం చేసారు. తాము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఇటీవల జరిగిన ప్రచారం పూర్తి అవాస్తవం అని చెపుతూ త మకు రాజకీయాల్లో రావాలన్న ఆలోచనే లేదు అంటు కొనసాగుతున్న ఉహాగానాలకు తెర దించడానికి ప్రయత్నించాడు. అయితే తన అన్నయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నందున ఎన్నికల సమయంలో అవసరం అయితే తాను ప్రచారంలో పాల్గొంటాను. అంతకు మించి తనకు వేరే పొలిటికల్ ఎజెండా తనకు ఏమీ లేదని తేల్చి చెప్పారు. అదేవిధంగా బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న ‘లెజెండ్' సినిమాలో తాను నటిస్తున్నాను అన్న వస్తున్న వార్తలపై నాగబాబు క్లారిటీ ఇస్తూ అసలు ఆ వార్తలు ఎలా వచ్చాయో తనకు తెలియదు అని తాను బాలకృష్ణ తో ఏ సినిమాలోను నటించడంలేదని స్పష్టం చేసారు.  తన కుమారుడు వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ హీరోగా నిలదొక్కుకోవడానికి అన్ని అర్హతలు తన కొడుకుకు ఉన్నాయి అంటు త్వరలోనే వరుణ్ తేజ్ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుంది అని అన్నారు. పవన్ రాజకీయ ప్రవేశం దుమారం మొదలైన తరువాత నాగబాబు స్వయంగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్యూ ఇది. ఈ ఇంటర్వ్యూలో కూడా గతంలో నాగబాబు మీడియాకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలోని అంశాలనే మళ్ళీమళ్ళీ చెప్పడం చూస్తూ ఉంటే పవన్ రాజకీయ ప్రవేశ దుమారానికి తాత్కాలిక విరామం నాగబాబు ప్రకటించినట్లే అనుకోవాలి. దక్షిణాది సినిమా రంగంలోనే కాకుండా జపాన్ లాంటి దేశాలలో విపరీతమైన క్రేజ్ ఉన్న రజనీకాంత్ స్థాయి తో పవన్ ను పోల్చడం మన తెలుగువారందరికీ ఆనందదాయకమైన కోలీవుడ్ ప్రేక్షకులు రాబోతున్న రోజులలో పవన్ కు ఎస్థానం ఇస్తారో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: