సాయి ధరమ్ తేజ్ డేరింగ్ స్టెప్ !
డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత చిత్రలహరి సినిమాతో సాయిధరమ్ తేజ్ ఈ ఏడాది సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో మారుతి దర్శకత్వంలో ప్రతీ రోజు పండుగే అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తేజు ఫస్ట్ టైమ్ ఓ డేరింగ్ స్టెప్ వేయబోతున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు మారుతి ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో తేజు డేరింగ్ స్టెప్ వేయడానికి సిద్ధమవుతున్నాడట. కెరీర్ లో తొలిసారిగా కొత్త దర్శకుడితో వర్క్ చేసేందుకు ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో నటించేందుకు తేజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ఈ కొత్త ప్రాజెక్ట్ ను సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించనున్నట్టు సమాచారం. మెగా హీరోలకు కొత్త దర్శకులతో చేసిన సినిమాలు ఆల్ మోస్ట్ మంచి సక్సెస్ ఇచ్చాయి. అల్లుఅర్జున్, సుకుమార్ డైరెక్షన్ లో చేసిన ఆర్య గొప్ప విజయం సాధించింది. అదే విధంగా గతేడాది వరుణ్ తేజ్, వెంకీ అల్లూరితో చేసిన తొలిప్రేమ సూపర్ హిట్ గా నిలిచింది. మరి ఇపుడు కొత్త దర్శకుడితో తేజుకు ఎలాంటి ఫలితం వస్తోందో చూడాలి.