ప్రభాస్ పెళ్లిపై సూపర్ ట్విస్ట్.. లవ్ మ్యారేజ్ అయినా కావొచ్చట..!

shami
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ పెళ్లిపై గత ఐదేళ్లుగా డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. బాహుబలి సినిమా కోసం ఐదేళ్లు రాసిచ్చిన ప్రభాస్ ఆ సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటాడనుకుంటే ఆ సినిమా తర్వాత వెంటనే సాహో మొదలు పెట్టి అది కూడా పూర్తి చేశాడు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లిపై రకరకాల వార్తలు రాగా వాటిల్లో ఏది వాస్తవం కాదని తెలుస్తుంది.


సాహో తర్వాత ప్రభాస్ పెళ్లి కన్ ఫాం అంటున్నారు. అయితే ఇన్నాళ్లు ప్రభాస్ కచ్చితంగా అరేంజెడ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటాడని అందరు అనుకుంటుండగా సాహో ప్రమోషన్స్ లో పెళ్లి జరగాల్సిన టైం వస్తే అదే జరుగుతుంది. అది అరేంజెడ్ మ్యారేజా లేక లవ్ మ్యారేజా అన్నది చెప్పలేం అంటున్నాడు ప్రభాస్. తన పెళ్లి లవ్ మ్యారేజ్ అయినా కావొచ్చని హింట్ ఇచ్చాడు యంగ్ రెబల్ స్టార్.    


ప్రభాస్ అలా అనడమే ఆలస్యం మళ్లీ ప్రభాస్ ప్రేమించే అమ్మాయి ఎవరు అంటూ డిస్కషన్స్ మొదలు పెట్టారు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి ప్రస్థావన వస్తే చాలు అనుష్క ను టార్గెట్ చేస్తుంటారు. రీసెంట్ గా సాహో ఇంటర్వ్యూస్ లోనే తనకు అనుష్క మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని చెప్పిన ప్రభాస్ తనది ప్రేమ పెళ్లి అయినా కావొచ్చని ట్విస్ట్ ఇచ్చాడు. ప్రభాస్ ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నాడో అని ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఉన్నారు.  


ఇక సాహో సినిమా విషయానికొస్తే.. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమా సుజిత్ డైరెక్ట్ చేశారు. ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించింది. బాహుబలి తర్వాత భారీ రేంజ్ లో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమా ఇదే అని చెప్పొచ్చు. అంచనాలైతే భారీగా ఉన్నా వాటిని అందుకునే సత్తా సాహోలో ఉందా లేదా అన్నది మరో రెండు వారాల్లో తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: