షాకింగ్ : సాహో కోసం .. వాళ్లు రూ. 100 కోట్లు వదులుకున్నారా..?

Chakravarthi Kalyan

సాహో.. ఇప్పుడు ఇండియా మొత్తం మాట్లాడుకుంటున్న సినిమా ఇది. ప్రభాస్ కేరీర్ లోనే హైలీ రిస్కీ మూవీగా చెప్పుకోవచ్చు.. కేవలం ప్రభాస్ కు బాహుబలి ద్వారా వచ్చిన ఇమేజ్ ఆధారంగా దాదాపు 300 కోట్ల రూపాయలతో తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రామోజీఫిలిం సిటీలో గ్రాండ్ గా జరిగింది.


ఈ వేదికపై ప్రభాస్ ఓ సంచలన విషం రివీల్ చేశాడు. ఈ సినిమాను ప్రభాస్ స్నేహితులే నిర్మించారు. నిర్మాతలు ప్రమోద్‌, వంశీ, విక్కీ ప్రభాస్ స్నేహితులే.. వాళ్లిద్దరూ ఈ సినిమాని జాగ్రత్తగా చేసుంటే... రూ.100 కోట్లు లాభం వచ్చేదేనట. కానీ వాళ్లు అంత లాభం వదులుకొని ఈ సినిమాని ఇంత భారీగా తీశారని ప్రభాస్ అంటున్నాడు.. అందరికీ ఇలాంటి ఫ్రెండ్స్‌ ఉండాలని కోరుకుంటున్నాడు..


ప్రభాస్ ఏమన్నాడంటే..

" నిర్మాతలు ప్రమోద్‌, వంశీ, విక్కీ నా స్నేహితులు. ఈ సినిమాని జాగ్రత్తగా చేసుంటే... రూ.100 కోట్లు లాభం వచ్చేది. అంత లాభం వదులుకొని ఈ సినిమాని ఇంత భారీగా తీశారు. మనందరికీ అలాంటి స్నేహితులు ఉండాలి..


ఈ విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు.. కేవలం ప్రభాస్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని.. ఓ తెలుగు సినిమాను ఇంత భారీ స్థాయిలో నిర్మించడం అంటే మాటలు కాదు. అందులోనూ నిండా పాతికేళ్లులేని కుర్రవాడు డైరెక్టర్.. అంతకుముందు ఏ స్టార్ తోనూ ఆడైరెక్టర్ పని చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం.. ప్రభాస్ ను నమ్ముకుని 300 కోట్లు ఖర్చు చేయడమంటే మాటలు కాదు.


అయితే ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. ప్రభాస్ కు బాహుబలి ద్వారా వచ్చిన క్రేజ్ కారణంగా ఈ సినిమా బిజినెస్ విషయంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ ఆ స్థాయిలో కలెక్షన్లు లేకపోతే నష్టపోయేది నిర్మాతలు కాదు.. డిస్ట్రిబ్యూటర్లే. అయితే బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా రూటే మారిపోయింది. ఇప్పుడు 300 కోట్ల బడ్జెట్ పెద్ద విషయంగా కనిపించకపోవడమూ విశేషమే. ఈ సినిమా బాహుబలిని మించిన సక్సస్ కావాలని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: