డార్లింగ్ మేము గుర్తున్నామా అంటూ ప్రభాస్ పై సెటైర్లు వేస్తున్న నెటిజన్లు..?
ఇటువంటి నేపథ్యంలో ఆగస్టు 30వ తారీఖున సినిమా విడుదలవుతున్న పరిస్థితుల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే గడపడం పై సోషల్ మీడియాలో సౌత్ ఇండస్ట్రీ సినిమా ప్రేక్షకులు సెటైర్లు వేస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ లైఫ్ ఇచ్చింది మేము నువ్వు అక్కడ ఎక్కువగా గడపడం మాకు నచ్చలేదు ఇటు వైపు కూడా కాస్తంత కనికరించి ఇటువైపు కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో గట్టిగా పాల్గొనూ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇటీవల ప్రమోషన్ లో భాగంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగిన ఈవెంట్లో స్టేజి పై రవీనా టాండన్‌తో కలిసి జుమ్మీకి రాత్ హాయ్ అంటూ ప్రభాస్ ఆడిపాడాడు.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుడల కానుండడంతో ఈ చిత్రం ప్రమోషన్స్‌ని కూడా కాస్త పెంచేసింది చిత్ర బృందం.అసలు మాట్లాడటమే తక్కువ, సిగ్గరి అలాంటి ప్రభాస్ స్టేజి మీద రవీనా టాండన్ తో డాన్స్ చేయడం అంటే మాములు విషయం కాదు. సాహో ప్రమోషన్స్ తో మారిపోయిన ప్రభాస్ కు ఫాన్స్ కూడా సాహో ప్రభాస్ అంటూ డాన్స్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ నటించింది ఒక సాంగ్ లో జాక్వలిన్ ఫెర్నాండేజ్ డార్లింగ్ ప్రభాస్ తో స్టెప్పులు వేసిన సంగతి మనకందరికీ తెలిసినదే. మొత్తం మీద సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చాల గట్టిగా చేస్తున్నారు సినిమా యూనిట్.