'పాయల్ రాజ్‌పుత్'పై ఫైర్ అవుతున్న మహిళలు ..!

guyyala Navya
'ఆర్‌ఎక్స్‌ 100' చిత్రంతో ఒక్కసారిగా ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖుల దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ పాయల్ రాజపుత్. ప్రస్తుతం ఆమె సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మాణంలో శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్న 'ఆర్డీఎక్స్ లవ్'లో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసారు చిత్ర బృందం. 


ఇక ఈ సినిమాలో 'ఆర్ఎక్స్ 100'లో లానే అందాల ఆరబోతతో యువతకు పిచ్చెక్కిస్తోంది పాయల్ పాపా. ఒక ప్రేమ జంట మితిమీరి ఎక్కడపడితే అక్కడ రొమాన్స్ చేస్తుండడం, అమ్మాయి డేర్ గా సేఫ్టీ ప్రికాషన్స్ గురుంచి చెప్పడం లాంటివి టీజర్ లో చూపించారు. ప్యూర్ గా యూత్ ని టార్గెట్ చేసుకున్న ఆర్డిఎక్స్ లవ్ టీమ్ దానికి తగ్గట్టే టీజర్ లో అంతే రొమాన్స్ ని చూపించింది.  


టేకింగ్ తో దర్శకుడు శంకర్ భాను ఎక్స్ పోజింగ్ లో పాయల్ రాజ్ పుత్ ఇద్దరూ తమ బాధ్యతలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారనే చెప్పాలి. ఇక దర్శకుడు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడానికి ఈ టీజర్‌ను కట్ చేశారో.. లేదంటే సినిమా మొత్తం ఇలానే ఉంటుందో తెలీదుకానీ, టీజర్‌ను మాత్రం అడల్ట్ కంటెంట్‌తో నింపేశాడు. దీంతో టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి భారీగా కామెంట్లు వస్తున్నాయి. 


మొత్తం అడల్ట్ కంటెంట్ తో ఈ సినిమా ఉందని, హీరోయిన్ పాత్రలో నటించిన పాయల్ రాజపుత్ బారి తెగించిందని, హిందీ సీరియళ్ళలో నటించే ఈ సుందరిని తీసుకొచ్చి ఆర్ఎక్స్ 100 సినిమా నుంచి శృంగార తారగా చూయించి గలీజ్, గలీజ్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు, ఇలాంటి సినిమాలు రావడం వల్లే అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్నాయి అని.. ఈ సినిమాని బ్యాన్ చెయ్యాలి అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: