హాట్ న్యూస్ గా మారిన సైరా కేక్స్ మ్యానియా !

Seetha Sailaja
‘సాహో’ విడుదలై ఫలితం తెలిసిపోవడంతో ఇక అందరి దృష్టి రేపటి నుండి చిరంజీవి ‘సైరా’ వార్తల పై మళ్ళుతుంది. వచ్చే నెలలో జరగబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆతరువాత ‘సైరా’ పాటల మ్యానియా ఆపై ‘సైరా’ ప్రమోషన్ వార్తలతో మీడియా హోరెత్తబోతోంది. 

ఈ నేపధ్యంలో ఇప్పుడు ‘సైరా’ మూవీకి కేక్స్ మ్యానియా తోడుకాబోతోంది. వినియోగ దారుల అభిరుచిలు రకరకాలుగా మారిపోతున్న నేపధ్యంలో ఇప్పుడు భాగ్యనగరంలో పుట్టిన రోజులు మ్యారేజ్ యానివర్సరీలకు సంబంధించి థీమ్ కేక్స్ ను తయారుచేయడం ఒక కొత్త ఫ్యాషన్ గా మారిపోయింది. 

ఇలాంటి పరిస్థితులలో ఈమధ్యనే జరిగిన చిరంజీవి పుట్టినరోజునాడు తన మామగారి కోసం కోడలు ఉపాసన డిజైన్ చేయించి పంపించిన కష్టమైజ్డ్ కేక్ ఇప్పుడు చాలామంది దృష్టిని ఆకర్షిస్తోంది. చిరంజీవికి రకరకాల కార్లు అంటే సరదా అన్న విషయం తెలిసిందే. చిరంజీవికి ఉన్న అనేక కార్లలో అత్యంత ఖరీదైన రోల్స్ రాయస్ కారు అంటే మెగా స్టార్ కు విపరీతమైన ఇష్టం. 

ఆ ఇష్టాన్ని గ్రహించిన ఉపాసన హైదరాబాద్ లో ఒక బోటిక్ నడుపుతున్న వినీల యడ్లపల్లి చేత ఒక ప్రత్యేకమైన కేక్ ను రోల్స్ రాయస్ కారు మోడల్ లో తయారు చేయించి తన మావగారి చేత పుట్టినరోజునాడు ఈ వెరైటీ కేక్ ను కట్ చేయించినట్లు సమాచారం. ఇప్పుడు ఈ కేక్ మోడల్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో ‘సైరా’ ప్రమోషన్ కోసం ఇలాంటి ప్రత్యేకమైన థీమ్ కేక్స్ తో రానున్న రోజులలో హంగామా జరిగినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. సినిమాల ప్రమోషన్ రకరకాల వెరైటీ పుంతలు తొక్కుతున్న నేపధ్యంలో ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అదేవిధంగా ఈ మూవీ ప్రమోషన్ చాల డిఫరెంట్ గా ఉండేలా చరణ్ డిజైన్ చేస్తున్నట్లు టాక్.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: