ఎట్‌ప్రెజెంట్ నితిన్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. తన అప్‌కమింగ్ ఫిల్మ్ 'హార్ట్ ఎటాక్' కూడ సక్సెస్‌ను అందుకుంటుందని నితిన్ భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నాడు. ఈ మూవీను కమర్షియల్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ పూరిజగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
హార్ట్ ఎటాక్ మూవీకు సంబంధించిన షూటింగ్ పార్ట్ తుది దశకు చేరుకుంది. ఈ మూవీకు సంబంధించిన ఆడియో వేడుకను కూడ డిసెంబర్ 2వ వారంలో జరిపేందుకు ప్రయత్నాలను చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో నితిన్ తన ప్రతి మూవీ ఆడియో ఫంక్షన్‌కు పవన్ కళ్యాణ్‌ను ఇన్వైట్ చేయడం ఆనవాతిగా వస్తుంది. తన హార్ట్ఎటాక్ మూవీ ఆడియో ఫంక్షన్‌కి కూడ పవన్‌ను ఎలాగైనా తీసుకురావాలని చూస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రపోజల్‌ను కూడ అప్పుడే పవన్ ముందు ఉంచాడు.
అయితే హార్ట్ఎటాక్ మూవీ ఆడియో ఫంక్షన్‌కు పవన్ రావడం వంద శాతం జరగని పని టాలీవుడ్ తేల్చి చెబుతుంది. ఎందుకంటే పూరిజగన్నాధ్,పవన్‌కళ్యాణ్‌ల మధ్య సరైన వాతావరణం లేదని, కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ తరువాత పవన్‌పై పూరీజగన్నాధ్ చేసిన కామెంట్సే అందుకు కారణం. 'నేను పవన్ కళ్యాణ్‌తో ఇంకెప్పుడూ మూవీను తీయను' అని పూరి జగన్నాధ్ స్టేట్మెంట్ ఇచ్చాడని ఆ మధ్య తెగ ప్రచారం జరిగింది. హార్ట్ఎటాక్ మూవీలో హీరో నితిన్ అయినా, డైరెక్టర్ పూరిజగన్నాధ్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పూరిజగన్నాధ్ ఫిల్మ్స్‌కు పవన్‌కళ్యాణ్ అటెండ్ అయ్యే పరిస్థితి ఉండదని అంటున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: