నేచురల్ స్టార్ నాని, వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం 'నాని'స్ గ్యాంగ్ లీడర్'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా, సెప్టెంబర్ 2న ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేయబోతున్నారు. 'నిన్ను చూసే ఆనందంలో...' అంటూ సాగే ఈ పాటను సెప్టెంబర్ 2 సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. నాని నటించిన గత చిత్రం జెర్సీ మంచి హిట్ నిచ్చిండి. ఇక మరి ఈ చిత్రం ఎలాంటి సక్సెస్‌ని ఇస్తుందో చూడాలి. అలాగే ఈ చిత్రం టైటిల్ గతంలో మెగాస్టార్చిరంజీవి నటించిన చిత్రం అద్భుతమైన సక్సెస్‌ని ఇచ్చింది. కానీ ఈ చిత్రానికి మరి ఎలాంటి సక్సెస్ వస్తుందో అని ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఎందుకనో గాని ఈ చిత్రం పైన మొదటి నుంచి కొంత నెగిటివిటీ అనేది వస్తుంది. ఇక మరి కథ ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది తెలియాలంటే సెప్టెంబర్ 13 వరకు వేచి చూడాల్సిందే.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్, మాటలు: వెంకీ, రచనా సహకారం: ముకుంద్ పాండే, పొడక్షన్ డిజైనర్: రాజీవన్, ఆర్ట్ డైరెక్టర్: రామ్‌కుమార్, ఎడిటింగ్: నవీన్ నూలి, వి.ఎఫ్.ఎక్స్.: మకుట, కాస్ట్యూమ్ డిజైనర్: ఉత్తర మీనన్, స్టిల్స్: జి.నారాయణరావు, కో-డైరెక్టర్: కె.సదాశివరావు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్.