ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ షూటింగ్ నవంబర్ చివరకు పూర్తి కాబోతోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత మహేష్ కు మళ్ళీ పెద్ద గ్యాప్ వచ్చే ఆస్కారం కనిపిస్తోంది అని అంటున్నారు. వాస్తవానికి ఎదో ఒక మంచి సబ్జెక్ట్ ను ఓకె చేసి డిసెంబర్ నుండి మరొక సినిమాను మొదలు పెట్టాలని మహేష్ భావిస్తున్నా జరుగుతున్న పరిణామాలు మహేష్ ఊహించిన విధంగా జరగడం లేదు అని అంటున్నారు.
మహేష్ తో సినిమా చేయాలని దర్శకుడు పరుశు రామ్ రకరకాల కథలు చెపుతున్నా మహేష్ పరుశు రామ్ ను పూర్తిగా నమ్మలేక పోతున్నాడని టాక్. వాస్తవానికి ‘కబీర్ సింగ్’ సక్సస్ తరువాత సందీప్ వంగాతో మహేష్ సినిమా చేయాలని రాయబారాలు కూడ జరిపినట్లు టాక్.
అయితే ఇప్పుడు సందీప్ వంగా దృష్టి అంతా బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ తో సినిమా చేసే విషయం పై ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో మహేష్ యూటర్న్ తీసుకుని తిరిగి వంశీ పైడిపల్లి వైపు చూస్తున్నా ఈ దర్శకుడు కనీసం ఇప్పటి వరకు మహేష్ కోసం తీయబోయే కథకు సంబంధించి కనీస ప్రయత్నాలు కూడ చేయలేకపోతున్నాడని టాక్.
మహేష్ కు బాగా సన్నిహితుడైన కొరటాల శివ మహేష్ కోరుకునే రాజమౌళి మరొక సంవత్సరం వరకు ఖాళీగా లేరు. త్రివిక్రమ్ ఈ ఏడాది డిసెంబర్ తో ఖాళీ అయిపోతున్నా మహేష్ కు నచ్చే కథ చెప్పే విషయంలో అంత ఆసక్తి కనపరచడం లేదని టాక్. దీనితో తన దగ్గరకు వస్తున్న కొత్త దర్శకులు చెప్పే కథలు నమ్మలేక మహేష్ నమ్మకం పెట్టుకునే టాప్ డైరెక్టర్లు అందుబాటులో లేక ఒక విచిత్రమైన ఊహించని గ్యాప్ మహేష్ కు రాబోతోందా అంటూ ఇండస్ట్రీలో ఊహాగానాలు గుప్పుమంటున్నాయి..