పవన్ కళ్యాణ్ కు 100 కోట్ల విరాళం !

Seetha Sailaja
నిన్న జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజునాడు మెగా బ్రదర్ నాగబాబు చేసిన సూచన హాట్ టాపిక్ గా మారింది. పవన్ కు పుట్టినరోజు కానుకగా 100 కోట్ల పార్టీ ఫండ్ సేకరించి ఇవ్వాలని జనసైనికులు భావిస్తున్నట్లుగా నాగబాబు తన సందేశంలో వ్యూహాత్మకంగా బయటపెట్టాడు. ఇలాంటి నిర్ణయం పవన్ అభిమానుల అంకిత భావానికి నిదర్శనం అంటూ నాగబాబు అభిమానులకు అభినందనలు కూడ తెలియచేసాడు. 

ఒక ప్రాంతీయ పార్టీగా ప్రారంభింపబడి ఎన్నికలలో 6.8 శాతం అంటే సుమారు 20 లక్షల ఓట్లు పోల్ చేయించుకున్న ‘జనసేన’ తన జనసైనికుల నుండి నిజంగానే 100 కోట్లు విరాళం రాబట్టగలిగితే అది ఒక చరిత్ర అవుతుంది. తెలుస్తున్న సమాచారం మేరకు కనీసం 500ల రూపాయలు విరాళంగా అభిమానులు అందరూ ఇస్తే 100 కోట్ల టార్గెట్ ను చేరుకోవచ్చు.

అయితే ఇలాంటి టార్గెట్ ను చేరుకోవాలి అంటే అభిమానులలో అంకిత భావంతో పాటు నిజాయితీ కూడ ఉండాలి. లేకుంటే ఈ విరాళాల పేరుతో జరిగే కార్యక్రమమంలో అనుకోని సంఘటనలు ఎదురై అనవసరపు అపకీర్తి వచ్చే ఆస్కారం ఉంది అంటూ కొందరు హెచ్చరిస్తున్నారు. పవన్ పోటీ చేసిన రెండు స్థానాలలోనూ ఓడిపోయినా ఆ ఓటమిని పట్టించుకోకుండా పవన్ వేస్తున్న అడుగులు అతడి ఆత్మస్థైర్యాన్ని సూచిస్తున్నాయి. 

జరిగిన పొరపాట్లను దిద్దుకుంటూ నిజంగానే జనం నమ్మకాన్ని జనసైనికుల ప్రోత్సాహాన్ని పవన్ పొందగలిగితే పవన్ ఆశిస్తున్న 100 కోట్లు ప్రస్తుత కాలంలో రాజకీయ పార్టీలకు చాల చిన్న మొత్తం. సాధారణంగా ఓట్లు వేసిన ఓటర్లకు రాజకీయ పార్టీలు ఎన్నికలలో డబ్బులు ఇస్తూ ఉంటాయి. అయితే దీనికి భిన్నంగా పవన్ తనకు ఓట్లు వేసిన అభిమానుల నుండి చందాల రూపంలో పార్టీకోసం విరాళాలు ఆశిస్తున్న పరిస్థితులలో ఫలితం ఎలా ఉంటుంది అన్నది రానున్న రోజులలో తెలుస్తుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: