మనదగ్గర పాప్ సింగర్స్ పేరు తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మనకు సినిమాలు ఎక్కువగా ఉంటాయి. సినిమాల్లో పాటలు పడుతుంటారు. పాప్ సింగర్స్ లా షోలు చేసినా మన జనాలు వాటిని పెద్దగా పట్టించుకోరు. గతంలో కొన్ని పాప్ ఆల్బమ్స్ వచ్చాయి. అందులో అలీషా వంటివి బాగా ఫేమస్ అయ్యాయి. అయితే, హాలీవుడ్ లో మాత్రం పాప్ సింగర్స్ కు మంచి డిమాండ్ ఉంటుంది. వాళ్ళు చేసే ఆల్బమ్స్ కోసం అక్కడి జనాలు ఆతృతగా ఎదురు చూస్తుంటారు.
పాప్ రాజ్యానికి చక్రవర్తి ఎవరు అంటే ఖచ్చితంగా వచ్చే సమాధానం మైఖేల్ జాక్సన్. అయన తన స్టెప్పులతోను అలానే తన పాటలతోను ఆకట్టుకున్నాడు. ఆ తరువాత బ్రిట్నీ స్పియర్, ఇలా ఎందరో ఇప్పుడు పాప్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీరు ఒక షో చేస్తే కోట్లాది రూపాయలు వస్తాయి. దానికోసం సమత్సరం కష్టపడుతుంటారు. షో హిట్టయ్యి, సాంగ్స్ బాగున్నాయి అంటే చాలు క్షణాల్లో ఆల్బమ్ హిట్ అవుతుంది.
ఎన్నో ఊహలతో ఎన్నో అంచనాలతో, ఎన్నో ఆశలతో పాప్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన స్పెయిన్ పాప్ స్టార్, డ్యాన్సర్ జోయనా జీవితం అర్ధాంతరంగా పాప్ షో వేదికమీదనే ముగిసింది. పాప్ స్టార్ గా ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటోంది. సూపర్ హాలీవుడ్ స్టార్స్ ఆర్కెస్ట్రా బృందంతో కలిసి పాప్ సింగర్ జోయనా లైవ్ మ్యూజిక్ కార్యక్రమంలో పాల్గొన్నది. షో హుషారుగా జోరుగా సాగుతున్నది.
హాజరైన జనం కేరింతలు కొడుతున్నారు. జోయనా హుషారుగా పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తున్నది. అదనపు ఆకర్షణ కోసం స్టేజీమీద బాణాసంచా ఏర్పాటు చేశారు. ఇలాంటివి పాప్ మ్యూజిక్ లో సాధారణంగా ఏర్పాటు చేస్తారు. అయితే, పొరపాటున అదుపుతప్పి పాప్ సింగర్ జోయనా వైపు దూసుకెళ్లింది. ఆమె అలర్ట్ అయ్యేలోపే ఆమెను తాకి అక్కడే పేలింది. దీంతో ఆమె అపస్మార్త స్థితిలో వెళ్ళింది. వెంటనే హుటాహుటిన ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ, జోయనా అప్పటికే కన్నుమూసింది. సడెన్ గా ఈ పరిణామం చోటుచేసుకోవడంతో షో మధ్యలోనే ముగిసింది. జోయనా జేవితంలా.