తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కాప్పాన్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ నెల 20న గ్రాండ్ గా విడుదలకానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను రేపు సాయంత్రం 7గంటలకు విడుదలచేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాఫై ఆసక్తిని తీసుకొచ్చింది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.
ఇక ఈ చిత్రం తెలుగులో బందోబస్త్ పేరుతో విడుదలకానుంది. ప్రముఖ నిర్మాత ఎన్ వి ప్రసాద్ ఈచిత్రం యొక్క తెలుగు థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నాడు. అయితే గత కొంత కాలంగా ఒక్క 24 తప్ప సూర్య నటించిన సినిమాలు తెలుగులో డిజాస్టర్ ఫలితాలను చవిచూశాయి. ఇటీవల విడుదలైన ఎన్ జి కె అయితే బయ్యర్లకు భారీ నష్టాలను తీసుకొచ్చింది. దాంతో సూర్య మార్కెట్ గోరంగా పడిపోయింది. మరి ఈ సినిమా తోనైనా సూర్య హిట్ కొట్టి మళ్ళీ కం బ్యాక్ అవుతాడో లేదో...
రంగం ఫేమ్ కేవీ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధాన మంత్రి గా నటించగా ఆర్య , బోమన్ ఇరానీ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సయేశా సైగల్ కథానాయికగా నటించగా హరీస్ జైరాజ్ సంగీతం అందించాడు. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. కాగా సూర్య కేవీ ఆనంద్ కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా. ఇంతకుముందు వీరిద్దరి కలయికలో అయాన్ (వీడోక్కడే), బ్రదర్స్ సినిమాలు తెరకెక్కగా ఈ ఈరెండు సినిమా లు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.