రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ఇంకా కనీసం సగం కూడ పూర్తి కాలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈసినిమాను ఎట్టి పరిస్థితులలోను వచ్చే సంవత్సరం జూలైలో విడుదల చేయాలని రాజమౌళి చాలపట్టు మీద పనిచేస్తున్నా పరిస్థితులలో అతడికి పూర్తిగా సహకరించడం లేదు అన్న అభిప్రాయం కలుగుతోంది. ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య అమెరికాకు వెళ్ళిన రాజమౌళికి ఇండియాతో సంబంధాలు కలిగి ఉన్న ఒక భారీ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ నుండి రాజమౌళికి ఒక ఆఫర్ వచ్చినట్లు టాక్.
‘ఆర్ ఆర్ ఆర్’ పూర్తి అయిన వెంటనే రాజమౌళి ‘మహాభారతం’ మూవీ మొదలు పెడితే దానికి తమ వంతు సహకారం పూర్తిగా ఇస్తాము అంటూ ఒక హాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ రాజమౌళికి చేసిన సూచనలతో ఈ విషయం గురించి ప్రాధమిక ఆలోచనలు రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో చేస్తున్నట్లు టాక్. వాస్తవానికి ‘మహాభారత’ ప్రాజెక్ట్ ఆలోచనలు అమీర్ ఖాన్ చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై అమీర్ ఖాన్ కు చాల వరకు ఆసక్తి తగ్గింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో తిరిగి రాజమౌళి ఆలోచనలలో ‘మహాభారత’ ప్రాజెక్ట్ వచ్చేలా ఆ హాలీవుడ్ నిర్మాణ సంస్థ తన వంతు కృషి చేసినట్లు టాక్.
ఇలాంటి పరిస్థితులలో అసలు ‘మహాభారతం’ లాంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ తీయగలిగితే ఎవరు ఆయాపాత్రలకు సరిపోతారు అని రాజమౌళి తన సన్నితుల మధ్య చేసిన అభిప్రాయ సేకరణలో కొన్ని షాకింగ్ సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది. భీష్ముడుగా అమితాబ్ దుర్యొధనుడుగా రానా భీముడుగా మోహన్ లాల్ అర్జునుడుగా మహేష్ పాత్రలను రాజమౌళికి సూచించినట్లు టాక్. అయితే కృష్ణుడు పాత్రకు సంబంధించి మాత్రం రాజమౌళికి ఎవరు ఎటువంటి సూచనలు చేయలేదని తెలుస్తోంది.
వాస్తవానికి భారీ ప్రాజెక్ట్ శక్తి రాజమౌళికి ఇలాంటి భారీ సినిమాల కోసం రాజమౌళిని నమ్ముకుని సంవత్సరాల తరబడి డేట్స్ ఇవ్వగల నటీనటులు దొరకం అంత సులువైన వ్యవహారం కాదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. నిజంగానే రాజమౌళి ‘మహాభారతం తీసి దేశంలోని అన్ని భాషలలోను విడుదల చేయగలిగితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో రాజమౌళి శాస్వితంగా మిగిలిపోతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు..