అనుష్క ‘సాహో’ సినిమాను చూసిందో చూడలేదో తెలియకపోయినా ఈమె మళ్ళీ వార్తలకు చిరునామాగా మారింది. ‘సైజ్ జీరో’ సినిమాలో నటించడానికి అనుష్క తన శరీరాన్ని లావుగా మార్చుకుని ఆ తరువాత ఆ లావును తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసి కేరళా నుండి ఆస్ట్రేలియా వరకు అనేక మంది వైద్యుల సలహాలు తీసుకుని తన వంతు ప్రయత్నాలు చేసింది.
అయితే ఆమధ్య ఆమె లుక్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఆ ఫోటోలలో అనుష్క కొద్దిగా సన్నగా కనిపించడంతో ఆమె తిరిగి తన గ్లామర్ లుక్ ను పొందింది అని భావించారు. ప్రస్తుతం ఈమె నటిస్తున్న ‘సైలెన్స్’ మూవీ షూటింగ్ కోసం ఎక్కువగా అమెరికాలో ఉంటున్న నేపధ్యంలో ఈమె లుక్ కు సంబంధించిన వార్తలు హడావిడి చేయలేదు.
అయితే అనుష్క రెండు రోజుల క్రితం తన కుటుంబ సభ్యులతో వినాయక చవితి చేసుకోవడానికి బెంగుళూరుకు వచ్చింది. టోర్న్ జీన్స్ వేసుకుని టి.షర్ట్ తో కనిపిస్తున్న ఈమె లుక్ లో గ్లామర్ తగ్గకపోయినా ఈమె మళ్ళీ చాల లావుగా బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇవ్వడంతో ఆ ఎయిర్ పోర్ట్ లో ఉన్న అనేకమంది అనుష్క లుక్ ను ఫోటో తీసి ఆ ఫోటోలతో షోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.
ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ గా మారడంతో అనుష్క లుక్ మారలేదా అంటూ హడావిడి మొదలైంది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో తిరిగి ఆ సినిమా పాత్ర లుక్ కోసం ఇలా మారిందా అంటూ సందేహాలు వస్తున్నాయి. ఏమైనా ‘సాహో’ ప్రమోషన్ లో అనుష్కకు సంబంధించిన ప్రశ్నలు లేకుండా ప్రభాస్ ఇంటర్వ్యూలు పూర్తి కాని పరిస్థితులలో అనుష్క ‘సాహో’ లో నటించినా నటించకపోయినా హాట్ న్యూస్ గానే కొనసాగింది..