‘RRR’ సినిమాలో అదిరిపోయే ప్రయోగం చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్..?
రాబోయే ఏడాది జులై చివరి వారంలో విడుదల చేయాలని భావిస్తున్నారు సినిమా యూనిట్. విషయంలోకి వెళితే ఈ సినిమా తెలుగు తమిళం హిందీ మలయాళం భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా సినిమాలో కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ తన డబ్బింగ్ నాలుగు భాషల్లో తానే చెప్పాలని డిసైడ్ అయినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో మరియు ఇండస్ట్రీ లో వినపడుతోంది. మొత్తంమీద చూసుకుంటే ‘RRR’ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పబోతున్నట్లు టాక్. మరోపక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్…. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.
ఇదిలా ఉండగా అక్టోబర్ 22వ తారీఖున కొమరం భీం పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ లుక్ విడుదల చేయబోతున్నట్లు ఫిలింనగర్ టాక్. ఏది ఏమైనా ఈ సినిమా గురించి బయటకు వస్తున్న వార్తలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. దీంతో ఈ వార్త విన్న నందమూరి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై దేశవ్యాప్తంగా చాలా అంచనాలు ఉన్నాయి.