మాస్ మత్తులో ఊగిపోతున్న రామ్..!

shami
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఛార్మి, పూరి కలిసి నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా రామ్ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. ఇదిలాఉంటే ఈ సినిమా రిలీజ్ కు ముందు కొన్ని సబ్జెక్టులను విని ఓకే చెప్పిన రాం ఇప్పుడు వాటిని వద్దని చెబుతున్నాడట. 


ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రాం తీసే మాస్ సినిమానే తీయాలన్న ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం కిశోర్ తిరుమలతో కథా చర్చలు నడుస్తున్నాయి. అయితే కిశోర్ చెప్పిన కథ ఓకే చెప్పిన రామ్ అందులో తన పాత్రని మాస్ ఆడియెన్స్ కు దగ్గరయ్యేలా క్యారక్టరైజేషన్ ఉండేలా చూడమని చెబుతున్నాడట.


కిశోర్, రామ్ కలిసి ఇదవరకు నేను శైలజా, ఉన్నది ఒకటే జిందగి సినిమాలు చేశారు. రామ్ చెప్పిన ఇన్ పుట్స్ ఇప్పుడు కిశోర్ ను ఇబ్బందుల్లో పడేస్తున్నాయట. డైరక్టర్ కిశోర్ తీసిన అన్ని సినిమాలు సాఫ్ట్ గా ఉంటాయి. అలాంటిది రామ్ తనతో మాత్రం మాస్ అండ్ కమర్షియల్ మూవీ చేయాలని అంటున్నాడట. తనకు చెప్పిన కథనే అలా తీయమని అంటున్నాడట.  


రామ్ చెప్పిన మార్పులు చేసేందుకు కిశోర్ నిరాకరిస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ మాస్ మత్తులో మునిగితేలుతున్నాడు. ఇస్మార్ట్ హిట్ అయ్యింది కదా అని ఎప్పుడు అలాంటి మాస్ కథలను నమ్ముకుంటే కష్టమే. ఆల్రెడీ అలా తన ఇమేజ్ కు సరిపోని మాస్ కథలతో రామ్ ఇదవరకు దెబ్బతిన్నాడు. కాని ఇస్మార్ట్ హిట్ తో తను మళ్లీ అలాంటి కథలే చేయాలని అంటున్నాడట. మరి రాం చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: