మళయాళ సినిమా ఒరు ఆధార్ లవ్ అనే ఓ చిన్న సినిమా టీజర్ తో సంచలనం సృష్టించిన హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్. ఆ సినిమా టీజర్ లో అమ్మడు కన్నుగీటి తుపాకి పేల్చగా ప్రేక్షకులంతా ఆమె వల్లో పడ్డారు. టీజర్ తోనే ఫేమస్ అయిన ఆ సినిమా తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారంటే అమ్మడి రేంజ్ ఏంటన్నది అర్ధమవుతుంది.
అయితే తెలుగులో లవర్స్ డేగా రిలీజైనా సరే సినిమాలో కంటెంట్ లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం తెలుగు, మళయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న ప్రియా ప్రకాశ్ వారియర్ విష్ణు ప్రియా అనే సినిమాతో కన్నడ పరిశ్రమలోకి అడుగుపెడుతుంది. ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో ఆమె పాల్గొన్నారు.
ఇక అందులో భాగంగా మీడియా ఇంటరాక్షన్ లో తనని ఏ హీరోతో సినిమా చేయడానికి ఇష్టపడతారని అడిగితే ఆమె చెప్పిన సమాధానం అందరికి షాక్ ఇచ్చింది. తాను ఒక హీరో పేరు చెబితే మిగతా హీరోలు తనకు ఛాన్సులు ఇవ్వరని అందుకే వారి పేర్లని చెప్పనని అంటూ తప్పించుకుంది ప్రియా ప్రకాశ్.
రీసెంట్ గా విజయ్ దేవరకొండతో పిక్ ఇన్ స్టాగ్రాంలో షేర్ చేస్తూ ఐ లైక్ యు అంటూ మెసేజ్ పెట్టింది ప్రియా. ఎక్కడ విజయ్ అని పేరు చెబితే కన్నడ ఫ్యాన్స్ కోప్పడతారో అని ఆమె ఒకరి పేరంటూ ఏమి చెప్పకుండా ఒకరితో నటించాలని ఉందని చెబితే మిగతా హీరోలు తనకు ఛాన్సులు ఇవ్వరని తెలివైన సమాధానం చెప్పింది. ప్రస్తుతం శ్రీదేవి బంగ్లా సినిమా చేస్తున్న ప్రియా ప్రకాశ్ ఆ సినిమా శ్రీదేవి జీవితానికి సంబంధించినది కాదని అయినా సరే ఆ సినిమాపై నెగటివ్ గా రాస్తున్నారని చెప్పుకొచ్చింది.