ప్రభాస్- కాజల్ మధ్య లేటెస్ట్ వార్ న్యూస్?
మరియు అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటీనటులు జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, ఎవిలిన్ శర్మ, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్ లాంటి ప్రముఖ నటులంతా సినిమాల్లో నటించారు. మరియు అదే విధంగా సినిమాలో స్పెషల్ సాంగ్ లో అందాల ఆరబోత హాట్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ ప్రభాస్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసి కుర్రకారుని ఒక ఊపు ఊపింది. బ్యాడ్ బాయ్ అంటూ సినిమా లో వచ్చిన పాటలు జాక్వలిన్ ఫెర్నాండేజ్ చూపించిన అందాలు సినిమా థియేటర్ లో ఉన్న ప్రేక్షకులని మైమరిపించయి.
ఇటువంటి నేపథ్యంలో ఈ స్పెషల్ సాంగ్ కోసం మొట్టమొదటిసారిగా యువి క్రియేషన్స్ సంస్థ కు చెందిన నిర్మాతలు ప్రభాస్ స్నేహితులు కాజల్ అగర్వాల్ సంప్రదించారట. అయితే కాజల్ ఒప్పుకోకపోవడంతో జాక్వలిన్ ఫెర్నాండేజ్ కి అవకాశం దక్కినట్లు సమాచారం. అయితే సినిమా విడుదల అయ్యాక తనని కాదని జాక్వెలిన్ ని ఎంచుకోవడంతో ప్రభాస్ పై కాజల్ మనస్తాపానికి గురైనట్లు వారిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినపడుతున్నాయి. మరోపక్క వచ్చిన వార్తలలో వాస్తవం లేదని బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది కామెంట్ చేస్తున్నారు...కేవలం జాక్వెలిన్ కు పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ ఉండడం తోనే జాక్వలిన్ ఫెర్నాండేజ్ నీ ఎంచుకున్నట్లు సమాచారం.