వరుస పరాజయాల తరువాత న్యాచురల్ స్టార్ నాని ఇటీవల జెర్సీ తో సూపర్ హిట్ కొట్టాడు. ఈ సమ్మర్ లో విడుదలైన ఈ చిత్రం నాని కెరీర్ లోనే కల్ట్ సినిమాగా నిలిచింది. ఈ చిత్రం తరువాతనాని నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 13న విడుదలకానుంది. ఈ చిత్రం ప్రపంచ వ్వాప్తంగా 30కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నాని కి యూఎస్ లో మంచి మార్కెట్ ఉండడం తో ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ హక్కులను సరిగమ సినిమాస్ 5 కోట్లకు సొంతం చేసుకుంది. అక్కడ ఈ చిత్రం నాని కెరీర్ లోనేఅత్యధికంగా 200 థియేటర్లలో అవుతుంది. మరి నాని ఈచిత్రంతో 30కోట్ల టార్గెట్ ను రీచ్ అవుతాడో లేదో చూడాలి.
రివెంజ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా శరణ్య , లక్ష్మి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందించాడు. సోలో గా విడుదలకానున్నఈ సినిమాపై మంచి అంచనాలే వున్నాయి.
ఇక ప్రస్తుతం నాని మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న వి అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అతను నెగిటివ్ షేడ్స్ వున్న క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ఇటీవలే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా రెండవ షెడ్యూల్ ఈనెల 15నుండి థాయ్ లాండ్ లో జరుగనుంది.