సైరా కోసం కాళ్ళమీద పడి అనుమతి తెచ్చుకున్న సంఘటనను బయటపెట్టిన చిరంజీవి !

Seetha Sailaja
తెలుగు సినిమా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ 25వ వార్షి కోత్సవం నిన్న హైదరాబాద్ లో ‘సినీ మహోత్సవం’ పేరుతో అత్యంత ఘనంగా జరిగింది. మెగా స్టార్ చిరంజీవితో పాటు కృష్ణంరాజు కృష్ణ మహేష్ బాబు లాంటి టాప్ హీరోలతో పాటు అనేకమంది సినీ ప్రముఖులు ఆ ఫంక్షన్ కు అతిధులుగా వచ్చారు. 

ఈ సందర్భంలో చిరంజీవి మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. సినిమా నిర్మాణ సమయంలో ఆ సినిమా కోసం ప్రొడక్షన్ మేనేజర్స్ పడే శ్రమ ఎవరూ పడరని నిద్రాహారాలు మాని వారు చేసే కష్టం వలెనే పెద్ద సినిమాలు అయినా చిన్న సినిమాలు అయిన నిర్మాణం జరుపుకుని విడుదల కాగాలుగుతున్నాయి అంటూ చిరంజీవి ప్రశంసలు కురిపించాడు. ఇదే సందర్భంలో తాను నటించిన ‘సైరా నిర్మాణ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర విషయం వివరించాడు.

‘సైరా’ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక లొకేషన్ అవసరం అయిందని అయితే ఆ లొకేషన్ కు అనుమతులు కష్టం అయిన పరిస్థితులలో తమ సంస్థ మేనేజర్ ఆ లొకేషన్ అనుమతి కోసం కొందరి కాళ్ళ మీద పడి అనుమతులు తెచ్చిన విషయాన్ని వివరించి అందరకీ మెగా స్టార్ షాక్ ఇచ్చాడు. తెర వెనుక అలాంటి కష్టాలు ప్రొడక్షన్ మేనేజర్స్ పడతారు కాబట్టే హీరోలు భారీ సినిమాలలో నటించ గలుగుతున్నారు అంటూ చిరంజీవి చేసిన ప్రశంసల వెనుక ఎంతో ఆవేదన కూడ ఉంది. 

ఇదే సమావేశానికి మరొక అతిధిగా వచ్చిన దిల్ రాజ్ మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు 32 సినిమాలు నిర్మించిన నేపధ్యంలో ప్రొడక్షన్ మేనేజర్స్ అసోషియేషన్ కు 32 లక్షల విరాళం ఇస్తున్న విషయాన్ని ప్రకటించాడు. ఇక సీనియర్ హీరోలు కృష్ణ కృష్ణంరాజులు మాట్లాడుతూ తాము గత 50 సంవత్సరాలుగా ఎంతోమంది మంచి ప్రొడక్షన్ మేనేజర్స్ ను చూసామని వారు లేకుంటే ఫిలిం మేకింగ్ జరగడమే కష్టం అంటూ ప్రొడక్షన్ మేనేజర్స్ కష్టం పై ప్రశంసలు కురిపించారు.. 
  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: