నయనతార.. కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్నది. ఇప్పటికే అనేక సినిమాలు చేసిన ఈ స్టార్ హీరోయిన్.. ఇప్పుడు సైరా సినిమా చేస్తున్నది. అక్టోబర్ 2 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది. దీంతో పాటు ఆమె తమిళంలో అనేక సినిమాలు చేస్తున్నది. నయనతార సినిమా చేయడం వరకు మాత్రమే చేస్తుంది. ప్రమోషన్స్ కు చాలా దూరంగా ఉంటుంది.
సినిమాలో నటించే ముందే అగ్రిమెంట్ చేసుకుంటుంది ఈ హీరోయిన్. ఎవరి సినిమా అయినా కావొచ్చు.. హీరో ఎవరైనా కావొచ్చు.. షూటింగ్ విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. సినిమా పూర్తయ్యాక అటువైపు కూడా చూడదు. రెమ్యునరేషన్ విషయంలో కూడా పట్టువదలదు. ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా ఉంటుంది అందుకే ఆమె టాప్ హీరోయిన్ అయ్యింది. రెండోసారి కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టి టాప్ స్థాయిలో దూసుకుపోతుంది అంటే నయనతార ఎలాంటి నటినో అర్ధం చేసుకోవచ్చు.
టాప్ హీరోలతో సినిమాలు చేసిన తరువాత బాలకృష్ణ శ్రీరామరాజ్యం సినిమా తరువాత ఆ రంగం నుంచి తప్పుకోవాలని అనుకుంది. ప్రభుదేవాకి వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యింది. తన ఆస్తులను అప్పగించింది. ఏమైంది తెలియదు.. ప్రభుదేవా భార్య అందుకు నిరాకరించడంతో విడిపోయారు. ఆ తరువాత కొన్ని రోజులకు తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. టాప్ నటిగా ఎదిగింది.
సోలో హీరోయిన్ గా సినిమాలు చేస్తూ శభాష్ అనిపించుకుంది. సోలో హీరోయిన్ గా ఆమె చేసిన సినిమాలు దాదాపుగా బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతున్నాయి. టాప్ హీరోలతో సినిమాలు చేసే సమయంలో ఆమె తీసుకునే రెమ్యునరేషన్ భారీగా ఉంటుంది. సైరా సినిమాకు దాదాపుగా 6 కోట్ల రూపాయలు తీసుకుందట. అది సినిమా వరకు మాత్రమే. తన రాకపోకలు, ఇతర ఖర్చులు అన్ని నిర్మాత భరించాల్సిందే. ప్రమోషన్స్ కు దూరం. చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తుంది. ప్రస్తుతం కో స్టార్ విఘ్నేష్ శివన్ తో సహజీవనం చేస్తోంది. పెళ్లి విషయం మాత్రం నో చెప్తున్నది.