అరె ఈ సినిమా కూడా ప్లాపేనా ?
తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా వస్తోన్న యాక్షన్ స్పై థ్రిల్లర్ చాణక్య
. అయితే ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్న టీజర్ మొత్తానికి సినిమా పై అంచనాలను పెంచింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా అవుట్ ఫుట్ బాగా రాలేదని ఈ సినిమా కూడా ప్లాప్ అవుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. మరోపక్క సినిమా చాల బాగా వచ్చిందని చిత్రబృందం చెప్పుకొస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయట. ముఖ్యంగా ఇండో - పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. అలాగే సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. ఏమైనా ఈ చిత్రానికి భారీగా ఖర్చు పెడుతూ.. రోజురోజుకి బడ్జెక్ట్ పెరుగుతున్నా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా వచ్చేలా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. ముఖ్యంగా ఇండో -పాక్ బోర్డర్ పరిసర ప్రాంతాల్లో చేసిన సీన్స్ చాల బాగా వచ్చాయట. అలాగే సినిమాలో హై బడ్జెట్ తో కుడనుకున్న యాక్షన్ సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకుంటాయట.
ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్ లో కొత్తగా కనిపించనున్నారు. కాగా గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ స్పై థ్రిల్లర్ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మరి గత కొన్ని సినిమాలుగా వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తోన్న గోపీచంద్ కి సరైనా హిట్ వచ్చి చాల కాలమే అయిపొయింది. ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ కొట్టాలని బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.